హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ఏడాదిలో తెలంగాణ హైకోర్టు షురూ.. తొలి చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు రాజకీయ ప్రముఖులు, లాయర్లు, హైకోర్టు సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిశాక జస్టిస్ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.

telangana high court started, cj and 12 justice taken oath

రాజ్‌భవన్‌లో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక.. హైకోర్టులో 12 మంది న్యాయమూర్తులు కొలువుదీరారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు లాయర్లు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

telangana high court started, cj and 12 justice taken oath

ప్రమాణ స్వీకారం చేసిన 12 మంది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు :

telangana high court started, cj and 12 justice taken oath

* జస్టిస్ అభినంద్ కుమార్ షావలి
* జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్
* జస్టిస్ రామ సుబ్రమణ్యన్
* జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
* జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
* జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
* జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు
* జస్టిస్ పొట్లపల్లి కేశవరావు
* జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్
* జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
* జస్టిస్ పొనుగంటి నవీన్ రావు
* జస్టిస్ బొలుసు శివశంకర్ రావు

వాస్తవానికి విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తుల్ని కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం 13 మంది మాత్రమే కొలువుదీరారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు 12 మంది న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించడంతో తెలంగాణ హైకోర్టు ప్రారంభమైంది.

English summary
Justice TBN Radhakrishnan taken the oath as first Chief Justice of the Telangana High Court. The Oath ceremony conducted in Raj Bhavan by governor narasimhan. 12 judges taken oath in the High Court conducted by Chief Justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X