హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ: వాదనలు ఇలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతనాల విషయంపై మరోసారి హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని కోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అంతేగాక, ఒక్కో రోజు గైర్హాజరుకు 8 రోజులవేతనం మినహాయించే అధికారం ఉందని చెప్పారు.

TSRTC Strike: కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదు: ఆర్టీసీ ఎండీ హెచ్చరికTSRTC Strike: కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదు: ఆర్టీసీ ఎండీ హెచ్చరిక

కార్మికుల జీతాలపై వాదనలు ఇలా..

కార్మికుల జీతాలపై వాదనలు ఇలా..

ఇది ఇలావుంటే, పనిచేసిన సెప్టెంబర్ నెల వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చేసిన పనికి జీతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని, హైకోర్టు కాదని అదనపు ఏజీ సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. కార్మికులు పనిచేసిన సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ మజ్దూర్ సంఘ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సమ్మె విరమించినప్పటికీ..

సమ్మె విరమించినప్పటికీ..


ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రెండ్రోజుల క్రితం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. అయితే, 50 రోజులకుపైగా చేసిన సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మాత్రం కార్మిక సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇష్టం వచ్చినప్పుడు సమ్మె చేస్తాం.. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరుతామంటే కుదరదని స్పష్టం చేశారు.

గురువారం కేబినెట్ భేటీ..

గురువారం కేబినెట్ భేటీ..


ప్రస్తుం కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని ఆర్టీసీ ఎండీ తేల్చి చెప్పారు. లేబర్ కమిషనర్ నిర్ణయం తర్వాతే తాము ఎలా వ్యవహరించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు. ఆర్టీసీ డిపోల వద్ద తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, సమ్మె విరమించిన నాటి నుంచి డిపోల వద్దకు చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపో మేనేజర్లను కోరుతుండటం గమనార్హం. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ అంశంపై తెలంగాణ కేబినెట్ గురువారం చర్చించనుంది.

English summary
Telangana High Court trial on TSRTC workers salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X