• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోంమినిస్టర్‌ మనవడా మజాకా.. డీజీపీ కారుపైనే టిక్కుటాక్కు..!

|

హైదరాబాద్ : వీడియోలు తీయడం.. ఆపై సోషల్ మీడియాలో పోస్టు చేయడం యువతకు ఫ్యాషన్‌లా మారింది. ఏదో సినిమా డైలాగుకో.. పాటకో అనుగుణంగా అభినయం చేస్తూ వీడియోలు తీయడం కామనైపోయింది. ఇక టిక్‌టాక్ లాంటి యాప్‌లతో యువత క్రేజీ మామూలు కాదు. అది ఎంతలా అంటే పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లే రేంజ్ అన్నమాట.

పనీపాటా లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న సంఘటనలు కూడా ఇటీవల వెలుగుచూశాయి. ఆ క్రమంలో టిక్కుటాక్కు వీడియోలు తీసిన ప్రభుత్వ ఉద్యోగులపై వేటు కూడా పడింది. అదలావుంటే తాజాగా తెలంగాణ హోం మినిస్టర్ మహమూద్ అలీ మనవడు ఏకంగా డీజీపీ కారును వాడుకుని టిక్‌టాక్ చేశాడనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మనవడి టిక్కుటాక్కు సరదా.. హోంమినిస్టర్‌కు తంటా తెచ్చిందిగా..!

మనవడి టిక్కుటాక్కు సరదా.. హోంమినిస్టర్‌కు తంటా తెచ్చిందిగా..!

టిక్‌టాక్ వీడియోల సరదా చివరకు పరువు తీస్తోంది. ఏదో సరదాగా తీయబోయి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు చాలామంది. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పనీపాటా వదిలేసి టిక్‌టాక్ వీడియోలు చేశారనే వార్తలతో వారిపై వేటు పడింది. అదలావుంటే తాజాగా తెలంగాణ హోం మినిస్టర్ మహమూద్ అలీ మనవడు తీసినట్లుగా పేర్కొంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహమూద్ అలీ మనవడు ఫర్ఖన్ అలీ.. డీజీపీ వాహనంపై ఎక్కి దర్జాగా టిక్‌టాక్ వీడియో తీశాడనే విషయం వివాదస్పదమైంది. ఏదో బాలీవుడ్ సినిమా డైలాగ్‌కు అనుగుణంగా అభినయం చేస్తూ తీసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది. హోంమినిస్టర్ మనవడు ఇలా చేయడమేంటనే కామెంట్లు జోరందుకున్నాయి. పోలీస్ ఉన్నతాధికారి వాహనం వాడుకుని ఇలా టిక్‌టాక్ వీడియోలు తీసుకుంటూ పోతే ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జంపింగులను కాపాడుకోలేదు.. అది మీ తప్పే.. కాంగ్రెస్‌కు కేసీఆర్ చురకలు..!జంపింగులను కాపాడుకోలేదు.. అది మీ తప్పే.. కాంగ్రెస్‌కు కేసీఆర్ చురకలు..!

 ప్రైవేట్ వ్యక్తుల చేతికి రక్షక్ వాహనం..!

ప్రైవేట్ వ్యక్తుల చేతికి రక్షక్ వాహనం..!

జూన్ మొదటివారంలో ఇలాగే రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన రక్షక్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడం దుమారం రేపింది. ఓ సీఐ పుత్రరత్నం తన స్నేహితులతో కలిసి రక్షక్ వాహనాన్ని రోడ్డెక్కించడంతో కలకలం రేగింది. రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకెళ్లడమే గాకుండా సైరన్ మోగిస్తూ, కేరింతలు కొడుతూ, నానా రచ్చ చేస్తూ హంగామా సృష్టించారు. దాంతో సదరు సీఐకి ఉన్నతాధికారుల నుంచి తలంటు తప్పలేదు.

మైనర్లు రక్షక్ వాహనంలో ఊరేగారనే వార్త మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్టుమెంటల్ విచారణ జరిపి రక్షక్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడంపై సదరు సీఐపై చర్యలు తీసుకున్నారు.

 పోలీస్ శాఖకు మచ్చ.. ఇదేమీ తీరు..!

పోలీస్ శాఖకు మచ్చ.. ఇదేమీ తీరు..!

ఫ్రెండ్లీ పోలీస్ అని ఏ ముహుర్తాన అన్నారో గానీ ఇలాంటి ఘటనలే తరచుగా దర్శనమిస్తున్నాయి. మొన్న రక్షక్ వాహనంలో మైనర్ల రచ్చ.. తాజాగా డీజీపీ వాహనంపై హోంమినిస్టర్ మనవడి టిక్కుటాక్కు వీడియో.. వెరసి పోలీస్ శాఖ అప్రతిష్ట పాలయ్యే ప్రమాదముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో పోలీస్ శాఖకు మచ్చ పడే అవకాశం లేకపోలేదు.

అదలావుంటే అది డీజీపీ వాహనమా లేదంటే హోంమినిస్టర్ వాహనమా అనే డైలమా కూడా నడుస్తోంది. ఏదిఏమైనా ప్రభుత్వ పరంగా ఉపయోగించాల్సిన వాహనాలను ఇలా బాధ్యత లేకుండా వాడుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే అనే టాక్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో హోం మినిస్టర్ మనవడిగా పేర్కొంటున్న ఆ వీడియో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీస్ వాహనాలు ఇలా వాడేస్తే ఇక ప్రజల్లో భయమెక్కడ ఉంటుందని కామెంటుతున్నారు.

తెలంగాణలో తెలంగాణలో "పువ్వు" వికసించేనా.. బీజేపీ "స్ట్రాటజీ" వర్కవుటయ్యేనా..!

 టిక్కుటాక్కు సరదా.. కొంప ముంచుతోందిగా..!

టిక్కుటాక్కు సరదా.. కొంప ముంచుతోందిగా..!


టిక్‌టాక్ వీడియోల సరదా కొంపముంచుతోంది. కొన్నిచోట్ల యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. చెరువుల దగ్గర, నీటి ప్రవాహాల దగ్గర.. అలా అనువుగానీ చోట వీడియోలు తీస్తూ మృత్యువాత పడుతున్నారు. అలాంటి సంఘటనలు చూస్తూ కూడా యువతలో మార్పు రావడం లేదు. మరికొందరైతే ప్రమాదపుటంచుల్లో నిల్చుని వీడియోలు తీస్తుండటం గమనార్హం. అదలావుంటే సమాజంలో బాధ్యత కలిగిన పౌరులు సైతం పనికిమాలిన వీడియోలు తీస్తూ ఇబ్బందుల్లో పడుతున్న సందర్బాలు కూడా కొకొల్లలు.

టిక్‌టాక్ వీడియోలతో ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయన యువత కేర్ చేయడం లేదు. సమాజానికి మేసేజ్ ఇచ్చే వీడియోలు తక్కువగా ఉంటున్నాయి. సినిమా డైలాగులకో, పాటలకో అభినయం కనబరుస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు. వాటివల్ల మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతోందనే వాదనలు లేకపోలేదు.

English summary
Telangana Home Minister’s grandson courted controversy when a TikTok of him video went viral. The video shows him sitting on top of an official vehicle. A few Telangana officials have already been transferred after they shot TikTok videos shot in their office went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X