హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఘనత కేసీఆర్‌దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సెగ మాత్రం చల్లారడం లేదు. రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు పోరాడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలంటూ న్యాయపోరాటం చేస్తున్నా కూడా లాభం లేకుండా పోతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. బీసీ లెక్కలు తేల్చేంతవరకు ఎలక్షన్లు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

పంజాబ్‌లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలిపంజాబ్‌లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలి

ఉన్నది 56.. ఇచ్చేది 23

ఉన్నది 56.. ఇచ్చేది 23

దేశవ్యాప్తంగా బీసీలు గణనీయంగా ఉన్నారు. దేశ జనాభాలో అత్యధిక వాటా బీసీలదే. అయితే 56 శాతమున్న బీసీలకు కేవలం 23 శాతమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దాంతో రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదనేది బీసీ నేతల వాదన. అందుకే న్యాయపోరాటానికి సై అంటున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీసీ గణాంకాలు తేల్చేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు.

రిజర్వేషన్లు తగ్గించిన ఘనత కేసీఆర్‌దే..!

రిజర్వేషన్లు తగ్గించిన ఘనత కేసీఆర్‌దే..!

బీసీల రిజర్వేషన్లు తగ్గించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ జనాభా గణన చేపడతామంటూ దాటవేయడం సరికాదన్నారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.

బీసీల సమగ్రమైన డేటా లేని కారణంగా సర్పంచ్‌ ఎన్నికల్లో చాలామంది బీసీ నాయకులు సర్పంచులు కాలేదన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్ 81 పంచాయతీరాజ్‌ చట్టం బీసీలు రాజకీయంగా ఎదగకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు

బీసీల లెక్క తేలేదాకా ఎన్నికలొద్దు : బీజేపీ

బీసీల లెక్క తేలేదాకా ఎన్నికలొద్దు : బీజేపీ

బీసీల ఓట్లతో గద్దెనెక్కిన టీఆర్ఎస్.. అదే బీసీలకు వెన్నుపోటు పొడవాలని చూడటం దారుణమంటున్నారు కమలనాథులు. బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి అధ్యయనం చేయకుండా.. లోకల్ బాడీ ఎలక్షన్లకు రిజర్వేషన్లు ప్రకటించిందని మండిపడుతున్నారు. ఇటీవల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. జాతీయ స్థాయి నేతలకు ప్రచారం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటాలు కొనసాగుతున్నందున.. అవి పరిష్కారం అయ్యేంత వరకు లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.

English summary
BC reservations may lead to an issue for Telangana local body elections. BC leaders protesting for 34 percent quota instead of 23 percent. They Demanding for bc census and cancellation of elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X