• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అసెంబ్లీ ముందు నిప్పంటించుకున్న నాగులు మృతి - అంత్యక్రియలు పూర్తి - ప్రభుత్వ హత్యేనన్న కాంగ్రెస్

|

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగలేదంటూ అసెంబ్లీ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న నాగులు(55) మృతిచెందారు. ఆదివారం బండ్లగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే ఈనెల 10న రవీంద్ర భారతి వద్ద నాగులు ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. 60 శాతానికిపైగా గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన కన్నుమూశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు చిన్నప్పటి నుంచి తెలంగాణ వీరాభిమాని. ఎక్కడ సభలు, సమా వేశాలు జరిగినా చురుగ్గా పాల్గొనేవా డని కుటుంబ సభ్యు లు తెలిపారు. 20 ఏళ్ల కిందటే కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేసిన నాగులు.. బండ్లగూడలో నివసిస్తూ.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కు భార్య స్వరూప, కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్‌ ఉన్నారు. పిల్లలిద్దరూ డిగ్రీ చదువుతున్నారు. డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి సాయం అందక పిల్లల్ని చదివించలేకపోతున్నానని కొంతకాలంగా మదనపడిన ఆయన.. చివరికి అసెంబ్లీ ముదు ఆత్మహత్య చేసుకున్నారు.

నన్ను రేప్ చేయడానికి బీజేపీ అనుమతించాలా?: సంజయ్ రౌత్‌పై కంగనా రనౌత్ ఫైర్ : గవర్నర్‌తో భేటీ

Telangana man who sets himself ablaze near Assembly dies

నాగులు మరణాన్ని ప్రభుత్వ హత్యగానే చూడాలని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వచ్చినా కూడా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిదని, అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఫలాలన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే దక్కాయని చనిపోయే ముందు నాగులు చెప్పిన మాటలు నూరుశాతం నిజమని పొన్నం అన్నారు. ప్రస్తుతం తెలంగాణ యువతలోనూ నాగులు తరహా ఆవేదన నెలకొని ఉందన్నారు.

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడంలేదంటూ నాగులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం అంటూ తిరిగిన తన భర్త.. చివరికి మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ నినాదాలు చేశాడని, కనీసం ఇప్పటికైనా తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని నాగులు భార్య స్వరూప అభ్యర్థించారు. ఆదివారం నాగులు మృతదేహానికి కీసర అమరవీరులస్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం బండ్లగూడలో అంత్యక్రియలు నిర్వహించారు.

English summary
N Nagulu, the 54-year-old man who attempted suicide at Telangana Assembly on Thursday died on Saturday. Nagulu attempted suicide by self immolating. He had said that he committed suicide as he did not get justice or benefit after formation of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X