హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్‌ కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్: కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అంటూ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా? అని ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు..పూలమ్మిన మంత్రి, టీఆర్ఎస్ నేతల ఫీట్లుజీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు..పూలమ్మిన మంత్రి, టీఆర్ఎస్ నేతల ఫీట్లు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకోసం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. వెళ్లి కాళ్లు పట్టుకుంటే ఓట్లు వేస్తారు కదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలను కేంద్రమత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అని నిలదీశారు. కొన్ని ఓట్లు సీట్ల కోసం మతిస్థిమితం కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్‌పై మండిపడ్డారు.

telangana minister ktr fires bandi sanjay for his surgical strikes comments.

పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ తల్లడిల్లాలి.. బీజేపీకి నాలుగు ఓట్లు సీట్లు రావాలన్నదే వారి ఆలోచన అని కేటీఆర్ బీజేపీపై ధ్వజమెత్తారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ రోహింగ్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు. రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.

రోహింగ్యాలు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేయని ఎన్నికలు జరగాలంటే... అది బీజేపీతోనే సాధ్యమన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు సంజయ్ ఇలా కౌంటర్ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హబ్సిగూడ రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.

English summary
telangana minister ktr fires bandi sanjay for his surgical strikes comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X