హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చివరీ గింజ కొంటాం, ఆ రెండు పార్టీలు అభివృద్ది నిరోధకాలు: మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్ట్‌కైనా కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందా.. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ఇవాళ నకిరేకల్ లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీంతో పాటు సీసీ రోడ్, డ్రైనేజ్ విస్తరణ పనులకు శంకుస్థాపన, వైకుంఠ ధామం, రైతు వేదికలను ప్రారంభించారు.రైతు వేదిక వద్ద జరిగిన సభలో మంత్రులు కేటీఆర్ పాల్గొని మాట్లాడారు

అభివృద్ది నిరోధకాలు..

అభివృద్ది నిరోధకాలు..

.
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధి నిరోధకాలుగా మారాయని విరుచుకుపడ్డారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఇవాళ తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఆదర్శం..

ఆదర్శం..


సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. సీఎం కేసీఆర్ వర్షాకాల సీజన్‌లో కూడా రైతు బంధు సాయం అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని సీజన్‌లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద అందించామని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అత్యధిక దిగుబడులు సాధించి గొప్ప పేరును సంపాందించిందని తెలిపారు.

Recommended Video

Etela Rajender పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు!!
దిక్సూచీలా..

దిక్సూచీలా..


తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్సూచిగా నిలిచిందని అభివర్నించారు. FCI సంస్థ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణగా రికార్డ్‌ను సాధించిందని... గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే పండించే వరిని.. ఇప్పుడు రాష్ట్రంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి రాని కనీస ఆలోచనను సీఎం కేసీఆర్ అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని.. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని అన్నారు మంత్రి కేటీఆర్.


.

English summary
telangana minister ktr slams central government for development issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X