వైరల్ : మండలాధ్యక్షుడికి మంత్రి సిఫార్సు.. మల్లన్న లెటర్ హెడ్‌పై సెటైర్లు
హైదరాబాద్ : మాజీ ఎంపీ, ప్రస్తుత తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి నెటిజన్లకు దొరికిపోయారు. నెనెవర్ని.. మల్లారెడ్డినంటూ ఆ మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయిన మల్లారెడ్డి మాట్లాడే తీరు అప్పుడప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతుంటుంది. తాజాగా ఆయన లెటర్ హెడ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
డిగ్గీరాజాకు షాక్.. కాంగ్రెస్ షేక్.. ఆ యువకుడికి బీజేపీ సన్మానం
మంత్రి హోదాలో ఆయన సంతకం చేసి ఇష్యూ చేసిన లెటర్ హెడ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. జలపురం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని కీసర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ జారీ చేసిన లెటర్ అది. వాస్తవానికి లెటర్ హెడ్స్ ప్రజా సంక్షేమం కోసం, ప్రభుత్వ కార్యక్రమాల కోసం వాడాల్సి ఉంటుంది. అయితే లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించారనే సెటైర్లు ఊపందుకున్నాయి. అది తెలిసో తెలియకో జరిగినా.. అమాత్యా ఏందయ్యా ఇది అంటూ నెటిజన్లు కామెంటుతున్నారు.