హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ 66.. ముళ్లదారి నుంచి పూలదారి వరకు.. ఉద్యమ నేత జీవితం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బక్కపలుచని మనిషే అయినా ఢిల్లీని షేక్ చేశారు. కేంద్ర పాలకుల మెడలు వంచి విజేతగా నిలిచారు. నీవల్ల ఏమవుతుందంటూ తిట్టిపోసిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు. రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, మార్గదర్శకుడు, స్ఫూర్తిమంతుడు.. ఇలా దేశం దృష్టినంతా తనవైపు తిప్పుకున్నారు. ఒకే ఒక్కడిగా ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన దార్శనీకుడిగా ముద్రవేసుకున్న కేసీఆర్.. 65 వసంతాలు పూర్తిచేసుకుని 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ.

క్షణాల్లా గడిచిన 18 ఏళ్లు

క్షణాల్లా గడిచిన 18 ఏళ్లు

చూస్తుండగానే 18 ఏళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. చూస్తుండగానే బక్కపలుచనిగా ముద్రపడ్డ మనిషి.. మహా స్ట్రాంగ్ గా మారిపోయారు. చూస్తుండగానే వెనుకబడ్డ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఇదంతా కూడా కేసీఆర్ దార్శనికతకు అద్దంపట్టే పరిణామ క్రమం. సమైక్య పాలనలో తెలంగాణను అణగదొక్కుతున్నారంటూ గళమెత్తి నినదించిన ఉద్యమనేత రాజకీయ ప్రస్థానానికి 2001లో బీజం పడింది. తెలంగాణ సాధించడం అంతా ఈజీ కాదు, అసలు నీవల్ల తెలంగాణే రాదు అంటూ ఎన్నో నోళ్లు పెదవి విరిచాయి. తెలంగాణ రాష్ట్ర సాధనను తన భుజానికెత్తుకున్న కేసీఆర్.. ఆ నోళ్లను పట్టించుకోలేదు. లక్ష్యసాధన కోసం తలమునకలై.. అదే ధ్యాసగా ముందుకెళ్లి చివరకు అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చారు.

ముక్కుసూటి తత్వం.. పట్టు వదలని క్రమం

ముక్కుసూటి తత్వం.. పట్టు వదలని క్రమం

తెలంగాణ అంటే తెలియని పరిస్థితి నుంచి.. తెలంగాణ పథకాలను ఇతరులు కాపీ కొట్టేంతవరకు సాగుతున్న ప్రస్థానం అంతా ఈజీగా జరగలేదు. వాక్చాతుర్యం, పక్కా ప్రణాళిక, అభివృద్ధి ఫలాలు.. ఇలా ప్రతి అంశంలో కేసీఆర్ దూరదృష్టిని ఎవరూ అందుకోరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఇజం వేరు.. ఆహార్యం వేరు.. మనసు వేరు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ ఎవరికీ అర్థం కారు. ఒకటి మాత్రం నిజం.. ఆయన అనుకున్నారంటే చేసి తీరతారు. ప్రత్యర్థులు ఎలాగూ విమర్శిస్తారు. కానీ ఆయనను దగ్గర్నుంచి చూసిన ప్రతిఒక్కరూ ఈ విషయాలను అంగీకరిస్తారు. కేసీఆర్‌కు అహంకారం ఉందంటారు కొందరు. కానీ అది ఆయా సందర్భాలను బట్టి మాత్రమే కనిపిస్తుంది. కానీ అది అహంకారం కాదు.. కోపం. కానీ చాలామంది దీన్ని అంగీకరించబోరు. కోపం చూపించినోడి దగ్గర ప్రేమ ఉంటుందంటారు. అది కేసీఆర్ విషయంలో అక్షర సత్యం. కోప్పడతారు, అంతలోనే దగ్గర తీస్తారు. అది ఆయన నైజం. ఉద్యమనేతగా బరిలోకి దిగిన కేసీఆర్‌ ప్రయాణమంతా ముళ్లబాటలే. కానీ ఏనాడు అధైర్యపడలేదు. అనుకున్న లక్ష్యానికి తన మేధస్సును ధారపోశారు. ఎక్కడ కొడితే ఉట్టి పలుగుతుందో సరిగ్గా అక్కడే కొట్టారు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించారు.

 బ్రహ్మరథం.. ప్రజా సంక్షేమం

బ్రహ్మరథం.. ప్రజా సంక్షేమం

ముక్కుసూటిగా మాట్లాడేటోళ్ల దగ్గర విషయం ఉంటుంది. కేసీఆర్ విషయంలోనూ అంతే. ఆయన నిక్కచ్చిగా మాట్లాడుతుంటే కొందరికి నచ్చదు. కానీ ఆయన అలా మాట్లాడారంటే దాని వెనుక అర్థముంటుంది. 65 వసంతాలు నిండిన కూడా.. ఎక్కడా లేని ఎనర్జీ ఆయన సొంతం. ఆయన ఓపిక, నడవడి.. ప్రతిదీ స్ఫూర్తిదాయకమే. ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలకంటే వంద రెట్లు ఆయనకు అధికంగా ఉన్నాయనే వారు లేకపోలేదు. 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, వృద్ధులకు పింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, రూపాయికే కిలో బియ్యం, హాస్టళ్లల్లో సన్నబియ్యం, పరిశ్రమలకు సత్వర అనుమతి, అణగారిన వర్గాలకు చేయూత.. ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలు తీర్చే ముఖ్యమంత్రిగా ముద్రవేసుకున్నారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. బంపర్ మెజార్టీతో మరోసారి అధికారం కట్టబెట్టారు. అభివృద్ధి మంత్రమే తప్ప మరో ధ్యాస లేని కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం మీద మరింత దృష్టి పెట్టనున్నారు.

దేశం బాగుండాలి.. అందుకే ఫెడరల్ ఫ్రంట్?

దేశం బాగుండాలి.. అందుకే ఫెడరల్ ఫ్రంట్?

భరతమాత ఒడిలో 29వ బిడ్డగా అవతరించిన తెలంగాణ.. నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధి బాట పట్టింది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో దూసుకెళుతున్న తెలంగాణను ఆయా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల తీరును ఫాలో అవుతున్నాయి. ఒకనాడు ఉద్యమ నేతగా ఎన్నో అవమానాలు భరించిన కేసీఆర్.. ఈనాడు సక్సెస్‌ఫుల్ ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక లేదని భావించిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్‌తో ముందుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును.. దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది ఆయన అంతరంగం. మొత్తానికి వ్యక్తిగా 65 సంవత్సరాలు నిండిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో మరో శక్తిగా ఎదగడంలో ఏమేర సఫలీకృతులవుతారో చూడాలి.

English summary
A story about telangana movement leader kcr on his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X