హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ ఓటు అరాచకానికా? అభివృద్ధికా?: ‘టీఆర్ఎస్‌ దివాళా’ అంటూ బీజేపీ నేత డీకే అరుణ ఫైర్

|
Google Oneindia TeluguNews

గద్వాల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ తెలంగాణ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని గెలిపించి అభివృద్ధికి కట్టం పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గద్వాలలో డీకే అరుణ ప్రచారం నిర్వహించారు.

మీ ఓటు ఎవరికి?

మీ ఓటు ఎవరికి?

గద్వాల ప్రజల మద్దతు అభివృద్ధికా..? లేక అరాచకానికా? ఆలోచించుకోవాలని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ సర్కారు ఈ ఆరేళ్లలో గద్వాలకు నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. అరుణమ్మ చేసిన అభివృద్ధి కళ్లులేని టీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదని ధ్వజమెత్తారు.

అప్పుడు గద్వాలలో స్వర్ణయుగం..

అప్పుడు గద్వాలలో స్వర్ణయుగం..

టీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా తీసిందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు కమిషన్లపై ఉన్న ప్రేమ.. అభివృద్ధిపై లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్ల కాలంలో గద్వాలలో స్వర్ణయుగంగా పాలన సాగిందని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి అంటే అర్థం కూడా తెలియదన్నారు.

టీఆర్ఎస్ సర్కారు మెడలు వంచి..

టీఆర్ఎస్ సర్కారు మెడలు వంచి..

ఓటు వేయకపోతే పథకాలు, పింఛన్లు రావు.. అని టీఆర్ఎస్ నేతలు ప్రజలను భయపెడుతున్నారని.. ప్రభుత్వం మెడలు వంచి పథకాలు అమలు చేయిస్తామని అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఆమె జోస్యం చెప్పారు. మతతత్వ పార్టీుల కులమతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. గద్వాలపై బీజేపీ జెండా ఎగిరితేనే గద్వాల అభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని అన్నారు.
గద్వాల ఖ్యాతిని దేశ వ్యాప్తంగా తీసుకెళ్తామని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అరుణమ్మ చేసిన అభివృద్ధి కొనసాగాలి.. గద్వాల మునిసిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో

మున్సిపల్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో


‘అంకితభావంతో ప్రతిరోజూ ప్రజల మధ్యలో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే బిజెపి అభ్యర్థులతో మన పట్టణం, నగరం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ప్రగతిలో భాగస్వామ్యమవుతుంది. విలువైన మీ ఓటుతో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం' అని బీజేపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. బీజేపీ తెలంగాణ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం.
సహజ వనరుల వినియోగంతోపాటు సౌర విద్యుత్ వాడకాన్నిపెంచడం.
చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సాహం.
రైతులు, చిరు వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారుల అవసరం కోసం రైతుబజార్‌ల ఆధునీకరణ, ప్రత్యేక వార్డు జోన్ల ఏర్పాటుకై కృషి.
దోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు వృత్తిపన్ను రద్దు,
ఉచిత విద్యుత్, ఉచిత మంచినీటి సౌకర్యం కల్పిస్తాం అని బీజేపీ తన మున్సిపల్ మేనిఫెస్టోలో పేర్కొంది.

English summary
telangana municipal elections: dk aruna fires at trs government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X