హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా కొత్త సచివాలయం ఆ అద్భుత ప్యాలెస్ డిజైన్ లా .. సీఎం కేసీఆర్ మలేషియా పర్యటనతో లింక్ !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి శరవేగంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ సెక్రటేరియట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ మలేషియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర ప్యాలెస్ తరహాలోనే ఉంది అని ప్రస్తుతం తెలంగాణ సచివాలయం డిజైన్ పై చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ జరగడానికి సీఎం కేసీఆర్ తొలి విదేశీ పర్యటనే కారణం.

తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్ ఇదే .. ఆరు అంతస్తులలో అన్ని హంగులతో ..తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్ ఇదే .. ఆరు అంతస్తులలో అన్ని హంగులతో ..

కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించి తీరాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం శరవేగంగా పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ,కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం, నిర్మాణ డిజైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసి పనుల్లో వేగం పెంచారు . ఇక టెండర్లను ఆహ్వానించి అక్టోబర్లో సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉంది.

కొత్త సెక్రటేరియట్ డిజైన్ పై ఆసక్తికర చర్చ

కొత్త సెక్రటేరియట్ డిజైన్ పై ఆసక్తికర చర్చ


అయితే పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభం కాగానే కొత్త సెక్రటేరియట్ డిజైన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ డిజైన్ నిజామాబాద్ లో నీలకంఠేశ్వర ఆలయ డిజైన్ లా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు కొత్త సచివాలయం డిజైన్ బెంగళూరు విధాన సౌధ లా ఉందని, వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ డిజైన్ లా ఉందని రకరకాలుగా, ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేశారు. అయితే తాజాగా మరో కొత్త ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

మలేషియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర ప్యాలెస్ లా ఉందని ప్రచారం

మలేషియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర ప్యాలెస్ లా ఉందని ప్రచారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి నిర్మించడానికి పూనుకున్న కొత్త సచివాలయ డిజైన్ మలేషియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర ప్యాలెస్ తరహాలో ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం జరగడానికి పెద్ద కారణమే ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం ఆగస్టులో తొలి విదేశీ పర్యటన గావించారు సీఎం కేసీఆర్.

తొలి విదేశీపర్యటనలో పెర్దానా పుత్ర ప్యాలెస్ సందర్శించిన కేసీఆర్

తొలి విదేశీపర్యటనలో పెర్దానా పుత్ర ప్యాలెస్ సందర్శించిన కేసీఆర్

సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి మలేషియా వెళ్లిన కెసిఆర్ పుత్రజయ లో ఉన్న పెర్దానా పుత్ర ప్యాలెస్ ను సందర్శించారు. అంతే కాదు అక్కడ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు కూడా దిగారు. మలేషియాలోని కౌలాలంపూర్ దగ్గరలో ఉన్న పుత్రజయలో ఉన్న ఈ ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల తదితరులతో కలిసి మలేషియా వెళ్ళినప్పుడు ఆ ప్యాలెస్ నిర్మాణాన్ని బాగా ఇష్టపడి ఉంటారని, ఆ డిజైన్ ఆర్కిటెక్చర్ సీఎం కేసీఆర్ కు బాగా నచ్చి ఉంటాయని అందుకే అదే తరహాలో తెలంగాణ కొత్త సెక్రటేరియట్ డిజైన్ రూపొందించారని అంటున్నారు.

Recommended Video

Telangana New Secretariat పై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రజాధనం వృథా | MLA Jagga Reddy ఆవేదన...!!
పెర్దాన పుత్ర ప్యాలెస్ తరహాలో తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !!

పెర్దాన పుత్ర ప్యాలెస్ తరహాలో తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !!

1997లో మలయ్, యూరోపియన్, ఇస్లామిక్ శైలుల కలబోతగా పెర్దానా పుత్ర ప్యాలెస్ ను నిర్మించటం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశారు. ఈ ప్యాలెస్ మొత్తం ఆరు అంతస్తులలో అద్భుతంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ కూడా మొదట ఆరు అంతస్తులే కొత్త సచివాలయం నిర్మాణం జరపాలని భావించినప్పటికీ, తర్వాత దానిని ఏడు అంతస్తులుగా మార్చారు. తెలంగాణ కొత్త సచివాలయం అత్యంత ఆకర్షణీయంగా ఉండాలని, విదేశీయులు ఎవరైనా వస్తే సెక్రటేరియట్ నుంచి ఫోటోలు దిగాలని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో చాలా అద్భుతంగా నిర్మించిన పెర్దాన పుత్ర ప్యాలెస్ తరహాలో తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కూడా అద్భుతంగా రూపుదాల్చబోతుందని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

English summary
It is being publicized that the new secretariat design approved by the Telangana state government is similar to the Pardana Putra Palace where the Malaysian Prime Minister's Office is located. It is known that CM KCR visited the palace as part of his first foreign tour in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X