• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?

|

హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ అందరికీ చెడ్డ పేరును తెస్తున్నారు. తాజాగా, కరోనా లక్షణాలతో వచ్చిన ఓ యువతికి పరీక్షలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

33 ఏళ్ల పద్మప్రియ అనే యువతి గత ఐదు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమె రాష్ట్ర ఆరోగ్యశాఖ బృందాన్ని సంప్రదించారు. దీంతో ఆమెను కింగ్ కోఠి ఆస్పత్రికి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవాలని ఆమెకు సూచించారు. కానీ, ఆమెకు కరోనా టెస్ట్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు ట్రావెల్ హిస్టరీ కానీ, డైరెక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ కూడా లేకపోవడంతో ఆమె పరీక్ష నిర్వహించలేదు.

Telangana: No Travel History, No Corona Test Policy Raises Concern, Symptomatic Patients Turned Away

ప్రియకు వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ టెస్ట్ చేయలేమని తెలిపారు. అంతేగాక, ఆమె యంగ్ కాబట్టి ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమెకు కరోనాను ఎదుర్కొనే శక్తి కూడా ఉందని అధికారులు చెప్పడం గమనార్హం. కాగా,

పద్మ ప్రియ ఓ సీనియర్ జర్నలిస్టు కావడం గమనార్హం. అంతేగాక, ఆమెకు నాలుగేళ్ల చిన్నారి ఉంది.

తాను 40 నిమిషాలపాటు ఆస్పత్రి వద్ద ఎదురుచూసినప్పటికీ కరోనా టెస్ట్ చేయలేదని పద్మ ప్రియ తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్, ట్రావెల్ హిస్టరీ లేదని కరోనా టెస్టుకు నిరాకరించారని చెప్పారు. నెల రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంటే ట్రావెల్ హిస్టరీ ఏముంటుందని ఆమె ప్రశ్నించారు.

శ్వాసలో తీవ్రమైన ఇబ్బంది ఉంటే తిరిగి ఆస్పత్రికి రావాలని వైద్యులు తనకు సూచించారని ప్రియ తెలిపారు. పలు యాంటిబయాటిక్స్ రాసిచ్చారని, వాటితో తనకు రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రియ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆమెను తిరిగి రప్పించి పరీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలో తాను గత రెండ్రోజులుగా ఐసోలేషన్ లో ఉండటంతో తన భర్త పూర్తిగా సహకరిస్తున్నాడని తెలిపారు ప్రియ. తన కూతురు కూడా తనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియనే కాదు, ఇలాంటివారు మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బంది ఇప్పటికే పలువురిని ఇలా వెనక్కి పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, గాంధీ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఆరోపణలను తోసిపుచ్చారు. ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 1001 కేసులు నమోదు కాగా, 25 మరణాలు సంభవించాయి. 316 మంది కోలుకున్నారు.

English summary
When 33-year-old Padma Priya developed fever, cough and body ache five days ago, she reached out to the state Health Department team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more