హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ నియామకాల్లో కేటుగాళ్ల లీలలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పోలీసు నియామక ప్రక్రియలో కన్నింగ్ బుద్ధి చూపిన కన్సల్టెన్సీ ఉద్యోగి | Oneindia Telugu

హైదరాబాద్‌ : పోలీసుల నియామక ప్రక్రియలో తప్పు దొర్లింది. కన్సల్టెన్సీ ఉద్యోగి కన్నింగ్ బుద్ధి.. అసలు అభ్యర్థుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థులతో కుమ్మక్కై డబ్బులకు ఆశపడ్డాడు. కష్టపడి అర్హత సాధించిన అసలైన అభ్యర్థులకు గండి కొట్టేలా ప్లాన్ చేశాడు. అయితే ఉన్నతాధికారులు సకాలంలో మేల్కొవడంతో.. సదరు మోసగాడి ఆటలకు చెక్ పెట్టినట్లైంది. లేదంటే అనర్హులు పోలీస్ కొలువుల్లో దూరిపోయేవారు.

పోలీసుల నియామక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అభ్యర్థుల శారీరక కొలతలతో పాటు హైజంప్, రన్నింగ్ తదితర ఈవెంట్లలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన తంతు కంప్యూటర్లలో పొందుపరిచే బాధ్యతను ఈ - సాఫ్ట్ అనే కన్సలెన్ట్సీకి అప్పగించారు. అందులో పనిచేసే ఉద్యోగి బానోతు నాగు బుద్ధి వక్రీకరించి అక్రమాలకు తెరలేపాడు. అనర్హుల జాబితా నుంచి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. తన బంధువు బుక్యా రమేశ్ ను ఏజెంట్ గా నియమించుకుని వసూళ్లకు పాల్పడ్డాడు.

మల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడుమల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడు

telangana police recruitment fraud by consultancy employee

ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని అక్రమాలకు తెరలేపాడు నాగు. అర్హత సాధించిన వారి జాబితాలోకి వీరి పేర్లు ఎంటర్ చేశాడు. దానికోసం జంగ శామ్యూల్, ముత్తమల్ల కిరణ్ కుమార్, గాదె జగద్గిరి అనే ముగ్గురి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఆరు లక్షలు తీసుకున్నాడు. అయితే ఈ కేటుగాడి లీలల్ని ఆదిలోనే పసిగట్టారు తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారులు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డీల్ తో సంబంధమున్న ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

English summary
In the process of police recruitment has been wrong. Consultancy employee made a fraud. Cheated in making money with the candidates who did not qualify for the physical exam. But while the superiors woke up in time, Otherwise, disqualified people would be in police duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X