హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హస్తం తట్టుకుంటుందా: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాకేంటి..?

|
Google Oneindia TeluguNews

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాకిచ్చే యోచనలో ఉందా...? ఆమేరకు గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా..?ఇప్పటికే అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాక్ ట్రీట్‌మెంట్ ఏంటి..? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు గులాబీ దండు కృషి చేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్

కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్

దేశం అంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. పక్క రాష్ట్రాల సంగతి అలా ఉంచితే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీవేడి రాజుకుంటోంది. ప్రత్యేకించి తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అదే ఊపును మరో మూడునెలల సమయంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కారు పార్టీకి ప్రధాన శతృవుగా ఉన్న కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చేందుకు తయారవుతున్నారు సీఎం కేసీఆర్.

ఖమ్మం సీటు గులాబీకేనా...?

ఖమ్మం సీటు గులాబీకేనా...?

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే... వ్యూహాలను అమలు చేయనుంది టీఆర్ఎస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పావులు కదిపేందుకు తయారవుతోంది. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో టీఆర్ఎస్ పలు సీట్లు చేజార్చుకున్నప్పటికీ... అది స్వల్ప మెజార్టీతోనే జరిగింది. ఈసారి ఖమ్మంలో ,మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత సులభం కాదని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని వైరా ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఉండదు. దీన్నే క్యాష్ చేసుకోనుంది గులాబీ పార్టీ. ఖమ్మం లోక్‌సభ పరిధిలో వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆరఎస్ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. కాంగ్రెస్ మధిర, పాలేరు, కొత్తగూడెంలలో గెలుపొందింది. టీడీపీ సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో విజయం సాధించింది. ఇక వైరా స్థానంను ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు.
ఇక కాంగ్రెస్‌కు 2,51,123 ఓట్లు దక్కగా... టీడీపీకి 2,52,937 ఓట్లు, సీపీైకు 32,757 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ పీపుల్స్ ఫ్రంట్‌కు మధ్య తేడా కేవలం 18,523 ఓట్లు మాత్రమే. వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములుకు 52,650 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు రాములు టీఆర్ఎస్‌లో చేరారు కాబట్టి కారు గుర్తుకు ఈ ఓట్లు అదనంగా చేరితే కాంగ్రెస్‌కంటే ఆధిక్యంలో ఉంటుంది.

ఇక అసెంబ్లీలో ఘోర పరాజయం చవిచూడటంతో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో ఖమ్మం పార్లమెంటు స్థానం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.

 మహబూబాబాద్ స్థానంపై కన్నేసిన గులాబీ దండు

మహబూబాబాద్ స్థానంపై కన్నేసిన గులాబీ దండు


ఇక మహబూబాబాద్ పార్లమెంట్ పరిస్థితి విషయానికొస్తే... గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4,99,619 ఓట్లు వచ్చాయి.టీఆర్ఎస్‌కు 4,90,575 ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ దోర్నకల్, నరసంపేట్, మహబూబాబాద్ సీట్లను కైవసం చేసుకోగా...కాంగ్రెస్ భద్రాచలం, పినపాక, ములుగు, ఇల్లందు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం మహబూబాబాద్ పార్లమెంటును పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌కంటే 9,044 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకటి కాదు అని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే స్థానిక నాయకత్వానికి ప్రజలు ఓటు వేస్తారని అదే లోక్‌సభ ఎన్నికల్లో వారు జాతీయ నాయకత్వాన్ని చూసి ఓటువేస్తారనే వాదన వినిపిస్తోంది కాంగ్రెస్.అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగాయని... లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ బీజీపీల మధ్య జరగనున్నాయని చెబుతోంది. ప్రధాని మోడీపై వ్యతిరేకత ఎన్డీఏ విధానంపై వ్యతిరేకత అంశాలు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ సీట్లు సాధించిపెడుతాయని జోస్యం చెబుతున్నారు.

కాంగ్రెస్ వాదన ఏమేరకు నిజం అవుతుందో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు వేచిచూడాల్సిందే..

English summary
It will not be an easy task for the Congress to win Khammam and Mahabubabad Lok Sabha constituencies, even though the TRS had got less votes there in the recent Assembly polls.The TRS has prepared a sketch to shock the Congress after the Lok Sabha election schedule is announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X