హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీఏ సేవలు ఆఫ్‌లైన్: లైసెన్స్, ఆర్సీ కోసం వాహనదారుల నిరీక్షణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రవాణాశాఖ ఆన్‌లైన్ సేవలు మొరాయిస్తున్నారు. మరోసారి ఆన్ లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాస్ట్ వీక్ కూడా సేవలకు అంతరాయం కలుగగా .. మరోసారి టెక్నికల్ ప్రాబ్లమ్ తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఆఫ్ లైన్ ...

ఆఫ్ లైన్ ...

అక్కడ, ఇక్కడ అని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో సర్వర్లు మూగబోయాయి. సాంకేతిక సమస్య సిబ్బంది ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వారు ఎదురుచూడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక్కొక్కరికి ఆన్ లైన్ టెస్ట్ పెడతారు. అదీ పాసయ్యాక వెహికిల్ డ్రైవ్ చేయడం చూసి లైసెన్స్ ఇస్తారు. కానీ సర్వర్ పనిచేయకపోవడంతో లైసెన్స్ కోసం వచ్చిన వారు నిరీక్షించాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు .. వేసవి సెలవులు కాబట్టి లైసెన్స్ తీసుకుందామని సమయం కేటాయించారు. అయితే ఇటీవల వస్తోన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వారిని తీవ్ర ఇబ్బంది పెడుతోంది.

నిరీక్షణ ..

నిరీక్షణ ..

మరికొందరు తమ వాహనానికి సంబంధించిన ఆర్సీ కోసం వస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలతో వారి పని అవడం లేదు. దీంతో కార్యాలయం వద్దే గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్ సేవలు ఎప్పుడూ ప్రారంభమవుతాయని ... అధికారులను అడిగినా స్పందించడం లేదు. వాస్తవానికి సాంకేతిక సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. సర్వర్ కు సంబంధించి నిపుణులు వచ్చి సమస్య పరిష్కరించాల్సి ఉంది. అయితే వారు ఎప్పుడూ వచ్చి సాల్వ్ చేస్తారనే అంశం వారికి కూడా క్లారిటీ లేకపోవడంతో సమాధానం చెప్పలేక మిన్నకుండిపోతున్నారు.

సౌకర్యాల లేమీ ..

సౌకర్యాల లేమీ ..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వాహనదారులు ఆర్టీఏ అధికారుల తీరును తప్పుపడుతున్నారు. నగర నడిబొడ్డున ప్రధాన కేంద్రంలోనే సౌకర్యాలు ఇలా ఉంటే .. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపడుతామని సంకేతాలిచ్చారు. వీరికి ప్రజాసంఘాలు మద్దతు తెలిపే అవకాశం ఉంది.

టెక్నికల్ ప్రాబ్లమ్ ...

టెక్నికల్ ప్రాబ్లమ్ ...

ఆర్టీఏ సేవలు నిలిచిపోవడంతో వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక సమస్యతోనే సేవలకు అంతరాయం కలిగిందని వివరించారు. సోమవారం స్లాట్ లను మంగళవారానికి వాయిదా వేసినట్టు స్పష్టంచేశారు. అంతేకాదు రేపటినుంచి సేవలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టంచేశారు. ఇటీవల కాలంలో సమస్య వస్తోందని గుర్తుచేస్తున్నారు. ఇష్యూ సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ... భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని భరోసానిస్తున్నారు. అయితే ఆర్టీఏ అధికారుల వ్యవహరశైలిని వాహనదారులు తప్పుపడుతున్నారు.

English summary
Telangana state transport onlice services interpted. On-line services once again stuck on the site. Last Week also disrupted services. motorists are struggling with technical problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X