హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు విచారణ.. ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో గురువారం (10.10.2019) నాడు మరోసారి విచారణ జరిగింది. ఓయూ విద్యార్థి వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై అటు కార్మిక సంఘాల నుంచి.. ఇటు ప్రభుత్వం నుంచి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. సమ్మెకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో ఆదేశించింది న్యాయస్థానం. ఆ మేరకు గురువారం నాడు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అడ్వకేట్ జనరల్. మరోవైపు సమ్మెకు దారి తీసిన పరిస్థితులు, తదితర అంశాలను కోర్టుకు వివరించారు కార్మిక సంఘాల నేతలు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఓయూ విద్యార్థి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ మేరకు గురువారం నాడు మరోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు అడ్వకేట్ జనరల్. సమ్మె కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అటు కార్మిక సంఘాల తరపున వారి లాయర్ కూడా న్యాయస్థానం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన ఇతర పిటిషన్లపై కూడా కోర్టు విచారణ జరిపింది. ఆ క్రమంలో ప్రభుత్వం, కార్మిక సంఘాలు, పిటిషనర్ల తరపున న్యాయవాదులు వినిపించిన వాదనలు పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!

న్యాయస్థానం ప్రశ్నలు.. ప్రభుత్వ లాయర్ సమాధానాలు

న్యాయస్థానం ప్రశ్నలు.. ప్రభుత్వ లాయర్ సమాధానాలు

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారించిన ధర్మాసనం.. ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రభుత్వం తరపు లాయర్‌ను ప్రశ్నించింది. అలాగే బస్సు పాసులను కూడా అనుమతించడం లేదనే విషయాన్ని ఎత్తి చూపింది. అయితే సమ్మె వల్ల ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని ప్రభుత్వం తరపున లాయర్ కోర్టుకు వివరించారు.

అదలావుంటే ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడుపుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని.. సమ్మెను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు. ఈ నెల 15వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం.

తెలంగాణ బంద్‌కు జేఏసీ నిర్ణయం.. అఖిల పక్ష సమావేశంలో ప్రకటన..!

తెలంగాణ బంద్‌కు జేఏసీ నిర్ణయం.. అఖిల పక్ష సమావేశంలో ప్రకటన..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం నాటితో ఆరో రోజుకు చేరింది. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. అయితే ఇటు కార్మిక సంఘాలు బెట్టు చేయడం.. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సమ్మె విషయం ఎటూ తేలలేక పోతోంది. మొత్తానికి సమ్మె ఫలితంగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమ్మెపై ప్రభుత్వం దిగిరాని పక్షంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి హెచ్చరించారు. ఆ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే నిమిత్తం గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ బంద్ ప్రకటనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
The Telangana RTC strike was once again heard in the High Court on Thursday. Next hearing on 15th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X