హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్.. జగిత్యాల లాస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్ ప్లేస్ కొట్టేసింది. అదే క్రమంలో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక 2019 ప్రకారం ఆయా జిల్లాలకు వివిధ స్థానాలు దక్కాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 4,57,034 రూపాయలు ఉండగా.. జగిత్యాల జిల్లాలో అధమంగా 92 వేల 751 రూపాయలుగా నమోదైంది. ఇక పెద్దపల్లి జిల్లాలో 1,46,634 రూపాయలు.. కరీంనగర్ 1,28,221, రాజన్న సిరిసిల్ల 99 వేల 296 రూపాయలుగా ఉండటం గమనార్హం.

సోషల్, ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ రిపోర్ట్

సోషల్, ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ రిపోర్ట్

తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లాల తలసరి ఆదాయాలకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. అందులో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. జగిత్యాల జిల్లా చిట్ట చివరి స్థానం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం అన్ని జిల్లాల కంటే మెరుగ్గా ఉంది. 4 లక్షల 57 వేల 34 రూపాయల తలసరి ఆదాయం నమోదు చేసింది ఆ జిల్లా. ఇక చివరి స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా తలసరి ఆదాయం 92 వేల 751 రూపాయలుగా ఉంది.

గంగమ్మ ఒడికి చల్లంగా మహా గణపతి.. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగంగమ్మ ఒడికి చల్లంగా మహా గణపతి.. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి నిమజ్జనం ప్రశాంతం

రంగారెడ్డి జిల్లా టాప్.. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే రెట్టింపు

రంగారెడ్డి జిల్లా టాప్.. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే రెట్టింపు

రాష్ట్ర తలసరి ఆదాయం కంటే కూడా రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఫలితాలు నమోదు చేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 5 వేల రూపాయలు కాగా.. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 4 లక్షల 57 వేల రూపాయలుగా ఉంది. అంటే రాష్ట్రానికంటే కూడా రెట్టింపు తలసరి ఆదాయం నమోదు చేసిందన్నమాట. ఈ జిల్లా పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలతో పాటు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉండటం.. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కూడా అదే స్థాయిలో జీతాలు ఉన్నాయి. అందుకే రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో టాప్ ప్లేస్ ఆక్రమించిందని చెప్పొచ్చు.

రంగారెడ్డి జిల్లా వివిధ రంగాల్లో ఇలా

రంగారెడ్డి జిల్లా వివిధ రంగాల్లో ఇలా

రంగారెడ్డి జిల్లా టోటల్ జనాభాలో 42 శాతం మంది ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 6 లక్షల 13 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండగా.. వీరి తర్వాత 2 లక్షల 13 వేల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇక రైతులు ఒక లక్షా 65 వేల మంది ఉండగా.. మరో 29 వేల 544 మంది కుటీర పరిశ్రమలపై ఆధారపడ్డారు. అదలావుంటే సాగు విషయంలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం దక్కడం గమనార్హం. ఇక అక్షరాస్యతలో 71.95 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల 30 వేల కుటుంబాలు ఉన్నాయనేది ఒక అంచనా. అందులో 7 లక్షల 90 వేల కుటుంబాలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది.

1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా

జగిత్యాల జిల్లా సారమిదే

జగిత్యాల జిల్లా సారమిదే

ఇక తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలోనే అధమంగా జిల్లా సగటు తలసరి ఆదాయం 92 వేల 751గా నమోదైంది. రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే 50 శాతానికి పైన తక్కువగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 5 వేల రూపాయలు కాగా.. జగిత్యాల జిల్లా తలసరి ఆదాయం 92,751 రూపాయలుగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన సోషల్, ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ నివేదిక వెల్లడించింది. జిల్లా భూ విస్తీర్ణం, సాగు విషయంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది.

English summary
Telangana Governement Released Capita Income Report. Rangareddy district got top place and jagtial district is last.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X