హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుల కుప్ప తెలంగాణ.. వడ్డీయే 11 వేల కోట్లు!.. కేంద్రం బయట పెట్టిన నిప్పులాంటి నిజాలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ || Telangana Debts Increased To 1,80,000 Crores || Oneindia Telugu

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? 2014లో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ ఐదేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగిపోయాయా? తెలంగాణ ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వడ్డీగా కడుతోందా? రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న అప్పు ఇప్పటికీ మూడింతలు పెరిగిందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణ అప్పుల కుప్పగా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే అందుకు సాక్షంగా నిలుస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దరిమిలా 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే అంతవరకు 69 వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఐదేళ్లలో అది దాదాపు మూడింతలకు చేరడం విస్మయం కలిగిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి.

అంగన్‌వాడీలో ప్లాస్టిక్ గుడ్లా.. పేరెంట్స్ ఫిర్యాదుతో పరేషాన్.. తీరా ఏమైందంటే..! అంగన్‌వాడీలో ప్లాస్టిక్ గుడ్లా.. పేరెంట్స్ ఫిర్యాదుతో పరేషాన్.. తీరా ఏమైందంటే..!

బంగారు తెలంగాణ ఏమో గానీ.. అంతా అప్పుల కుప్పే..!

బంగారు తెలంగాణ ఏమో గానీ.. అంతా అప్పుల కుప్పే..!

బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని నొక్కి వక్కాణిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు.. అప్పుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. ధనిక రాష్ట్రమంటూ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లలో అప్పులు 159 శాతం పెరగడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చనుందనే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న అప్పులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు మూడింతలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదలావుంటే ఖజానా ఖాళీ అయిందనే వార్తలను కూడా ప్రభుత్వ పెద్దలు తోసిపుచ్చుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది విపక్షాల ఆరోపణ. తెలంగాణ అప్పుల గురించి తాజాగా కేంద్రం వెల్లడించిన లెక్కలు రాష్ట్ర ప్రజలను కలవరపెట్టే అంశం అంటున్నారు అపొజిషన్ లీడర్లు.

భారీగా అప్పులు.. ఏ యేటికాయేడు పెరుగుతున్న కుప్ప

భారీగా అప్పులు.. ఏ యేటికాయేడు పెరుగుతున్న కుప్ప

తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. ఈ ఐదేళ్లలో అప్పులు వీపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఈనాటితో పోల్చితే అప్పుల కుప్ప పేరుకుపోయింది. ఇదంతా కూడా సాక్షాత్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించిన నిప్పులాంటి నిజాలు. మంగళవారం నాడు కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం 2014, జూన్‌ 2 నాటికి 69 వేల 517 కోట్ల రూపాయల అప్పులు ఉండగా.. 2019 మార్చి చివరినాటికి లక్షా 80 వేల 239 కోట్లకు చేరాయని వెల్లడించారు.

వామ్మో అప్పుల కుప్ప.. కేంద్ర గణాంకాలు చూస్తే కంగు తినాల్సిందే..!

వామ్మో అప్పుల కుప్ప.. కేంద్ర గణాంకాలు చూస్తే కంగు తినాల్సిందే..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ బడ్జెట్ గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల వారీగా పెరిగిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీ వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

2014-15 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మీద 79 వేల 880 కోట్ల అప్పుల భారం ఉండగా 5 వేల 593 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించింది. 2015-16 నాటికి అప్పులు 97 వేల 992 కోట్లకు చేరగా 7 వేల 942 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్‌కు రాష్ట్ర అప్పులు ఏకంగా లక్షా 34 వేల 738 కోట్లకు చేరాయి. ఆ ఏడాది 8 వేల 609 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ చెల్లించింది ప్రభుత్వం. ఇక 2017-18 నాటికి అప్పుల భారం మరింత పెరిగింది. ప్రభుత్వం చేసిన అప్పులు లక్షా 51 వేల 133 కోట్ల రూపాయలకు చేరగా.. ఆ సంవత్సరం 11 వేల 139 కోట్ల వడ్డీ కట్టింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి అప్పులు తడిసిమోపెడయ్యాయి. లక్షా 80 వేల 239 కోట్ల రూపాయల అప్పుకు గాను 11 వేల 691 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడం గమనార్హం.

అవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపంఅవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపం

అబ్బే ఖజానాకు ఢోకా లేదే.. మే నెలలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రకటన

అబ్బే ఖజానాకు ఢోకా లేదే.. మే నెలలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రకటన

తెలంగాణ ఖజానా ఖాళీ అయిందంటూ మే నెల మూడవ వారంలో మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు రంగంలోకి దిగి అలాంటిదేమీ లేదంటూ ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సెలవిచ్చారు. ఉద్యోగులకు వేతనాల దగ్గర్నుంచి వివిధ సంక్షేమ పథకాలకు నిధులు సకాలంలోనే సమకూరుస్తున్నట్లు తెలిపారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ పరంగా కూడా తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.

ఆర్థిక వృద్ధి రేటు నమోదులో దేశవ్యాప్తంగా తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ అమలవుతున్నదాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ఖజానా పరిస్థితేంటో అర్థమవుతుందన్నారు. వృద్ధి రేటు గనక 14 శాతం కంటే తక్కువ నమోదైతే.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇస్తుంది. దాన్ని బట్టి తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటుకు ఢోకా లేదనే విషయం స్పష్టమవుతోందని తెలిపారు. సాధారణంగా పెట్టుబడులు పెరిగేకొద్దీ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని.. రాష్ట్రాల ఆదాయం పెరిగే క్రమంలో ఖర్చులు కూడా పెరుగుతాయని వెల్లడించారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించిన వివరాలు చూస్తేనేమో రాష్ట్ర ఖజానా అప్పుల కుప్పగా తయారైంది.

English summary
Telangana State Government Paying Crores of Rupees as Interest amount for debts. In 2014, there is only 69 thousand crores debts. Now telangana debts increased to One lakh eighty thousand crores. These details are released in written by Central Finance Minister Nirmala Sitaraman in Rajyasabha as congress MP MA Khan raised the questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X