హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

139 కేంద్రాల్లో వ్యాక్సిన్.. రేపటి వ్యాక్సినేషన్‌కు తెలంగాణ రెడీ..

|
Google Oneindia TeluguNews

తొలి విడుత కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 3.60 లక్షల డోసులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు పంపిణీ చేసేందుకు 139 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 99 ప్రభుత్వ దవాఖానలు, 40 ప్రైవేట్‌ దవాఖానలు ఉన్నాయి.

Recommended Video

కోవిడ్ వాక్సినేషన్ పై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు: తప్పకపాటించాలి
28 రోజుల తర్వాత..

28 రోజుల తర్వాత..

మొదటి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ భద్రత కోసం 800 కోల్డ్ చైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి వ్యాక్సిన్‌ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్

హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్

తొలిరోజు 13వేల 900 మంది హెల్త్‌వర్కర్లకు వ్యాక్సిన్‌ వేస్తారు. రాష్ట్రానికి 16 లక్షల సిరెంజ్‌లు చేరాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10 లక్షల మంది ఉద్యోగులను ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. శనివారం నుంచి ప్రతీ రోజు వ్యాక్సిన్ ఇస్తారు. ఎంపిక చేసిన.. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మాత్రమే టీకా వేస్తారు.

గర్బిణీలు, బాలింతలకు నో

గర్బిణీలు, బాలింతలకు నో

ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఏర్పాట్లను డీఎంఈ రమేష్ రెడ్డి పరిశీలించారు. రేపు 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, హిమోఫిలియా వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పారు. 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వమని స్పష్టంచేశారు. కరోనా వైరస్ నుంచి కోలుకొని 4 వారాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చనా తెలిపారు. ఏ వ్యాక్సిన్‌లోనైనా రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయని.. లక్షల్లో ఒకరికి మేజర్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రియాక్షన్‌ వచ్చిన వారికి చికిత్స కోసం 57 ఆసుపత్రులను ఏర్పాటు చేశామని డీఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు.

English summary
telangana state wide 139 vaccination centres are ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X