• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూ

|

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రాదాన్యం అంతా ఇంతా కాదు. అంతస్తుల తారతమ్యం లేని గొప్ప వేడుక. చిన్నా పెద్దా తేడా లేని పండుగ. ఏడాదికోసారి వచ్చే బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. నగరాల్లో ఉన్న వారు సైతం ఊళ్లకు పయనమవుతారు. రంగు రంగుల పూలను ఒక్క చోట చేర్చి ఆనందాల పూదోటగా మార్చుతారు ఆడబిడ్డలు. ఉరుకుల పరుగుల జన జీవితాన ఈ పండుగ సరికొత్త ఆనందాలు నింపుతుంది. బతుకమ్మ అంటే బతుకుల్లో వెలుగులు నింపే పండుగగా అభివర్ణిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ పూల పండుగ సంబురాలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

పూల పండుగ వచ్చే.. సంబురాలు తెచ్చే

పూల పండుగ వచ్చే.. సంబురాలు తెచ్చే

పితృ అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఈ సంబురాలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మొక్కజొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం లాంటి పదార్ధాలు నైవేద్యాల తయారీలో ఉపయోగిస్తారు.

ప్రతి రోజు సాయంత్రం వాకిలిని శుభ్రం చేసి బతుకమ్మరను కొలుస్తూ పాడే పాటలు ఆకట్టుకుంటాయి. ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మను ముస్తాబు చేయడానికి ఆడపడుచులు పోటీ పడుతుంటారు. అన్నాదమ్ములు ఊరి శివార్లలోకి వెళ్లి తంగేడు పూలు, గునుగు పూలు కోసుకు వస్తారు. అలా తెచ్చిన పూలను అందంగా పేర్చుతూ అక్కాచెళ్లెల్లు పోటీ పడుతుంటారు.

తెలంగాణపై టీడీపీ కన్నేసిందా.. కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీయా?

ఆడపడుచులు ఒక్క చోట చేరి

ఆడపడుచులు ఒక్క చోట చేరి

చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు అందరూ ఒక్క చోట చేరి వారు తయారు చేసిన బతుకమ్మలను అందంగా పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. చివరగా అందరూ కలిసి ఎవరి బతుకమ్మను వారు తలపై పెట్టుకుని చెరువులు, వాగుల వైపు ఊరేగింపుగా బయలుదేరుతారు. నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యాక తమ వెంట తెచ్చుకున్న పిండి పదార్ధాలను వాయినాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ సరాదాగా గడుపుతారు.

బతుకమ్మ పండుగలో తెలంగాణ అస్థిత్వం

బతుకమ్మ పండుగలో తెలంగాణ అస్థిత్వం

తెలంగాణ అస్థిత్వం బతుకమ్మ పండుగలో కనిపిస్తుంటుంది. తరతరాలుగా జరుపుకుంటున్న ఈ పండుగ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకుని తోటి మహిళలు విచారం వ్యక్తం చేసేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మా, బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారట. అలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో లాంటి పాటల వెనుక ఉన్న మర్మం అదేనంటారు పెద్దలు.

ఉయ్యాల పాటల్లో మర్మం అదే

ఉయ్యాల పాటల్లో మర్మం అదే

బతుకమ్మ ఉయ్యాల పాటలో వైవిధ్య భరితమైన అంశాలు కనిపిస్తాయి. కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల మేళవింపుగా ఈ పాటలు అలరిస్తాయి. బతుకమ్మ పాటలు వినసొంపుగా ఉండటమే గాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కడతాయి.

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరం.. రేసులో టీడీపీ సైతం.. తీన్మార్ మల్లన్న వ్యూహామేంటో..?

తొమ్మిది రోజుల సంబరాలు ఇలా :

తొమ్మిది రోజుల సంబరాలు ఇలా :

ఒకటో రోజు : "ఎంగిలి పూల బతుకమ్మ" - దసరా పండుగకు ముందు వచ్చే మహా అమావాస్య నాడు (పితృ అమావాస్య) బతుకమ్మ తొలిరోజు వేడుక ప్రారంభమవుతుంది. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. బతుకమ్మను పేర్చి చుట్టూ తిరుగుతూ ఆట పాటలతో సందడి చేస్తారు ఆడపడుచులు. అనంతరం ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఆరగిస్తారు.

రెండో రోజు : "అటుకుల బతుకమ్మ" - సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.

మూడో రోజు : "ముద్ద పప్పు బతుకమ్మ" - ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సిద్ధం చేస్తారు.

నాలుగో రోజు : "నానే బియ్యం బతుకమ్మ" - నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

ఐదో రోజు : "అట్ల బతుకమ్మ" - అట్లు లేదా దోశ లను నైవేద్యంగా పెడతారు.

ఆరో రోజు : "అలిగిన బతుకమ్మ" - ఆరో రోజు ఆశ్వయుజ పంచమి కాబట్టి ఎలాంటి నైవేద్యాలు పెట్టరు.

ఏడో రోజు : "వేపకాయల బతుకమ్మ" - బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదో రోజు : "వెన్న ముద్దల బతుకమ్మ" - నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు

తొమ్మిదో రోజు : "సద్దుల బతుకమ్మ" - చివరి రోజు ఆశ్వయుజ అష్టమి కాబట్టి ఆనాడు దుర్గాష్టమిని జరుపుకొంటారు. పెరుగు, అన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, ఇలా ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

English summary
Telangana Traditional Festival Batukamma Started. Nine days Celebrations held state wide. Women will celebrate in great way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X