హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఇవాళ,రేపు ఓ మోస్తరు వానలు... బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం...

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో గురువారం(నవంబర్ 5),శుక్రవారం(నవంబర్ 6) ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. శ్రీలంక తీరానికి సమీపంలో 3కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తె

ఇటీవలి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం ఎంతలా అతలాకుతలమైందో తెలిసిందే. వందేళ్ల క్రితం మూసీ ఉప్పొంగిన నాటి పరిస్థితులు మళ్లీ కళ్లకు కట్టాయి. దీంతో వాన అంటేనే హైదరాబాద్ జనం భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అటు జిల్లాల్లోనూ భారీ వర్షాలకు పంటలు మునిగిపోయాయి. హైదరాబాద్‌లో చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లల్లో సామాగ్రి కొట్టుకుపోయింది.

telangana weather forecast moderate rains in the state for two days

కొన్నిచోట్ల కార్లు,బైక్స్ సైతం వరద నీటిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడక్కడ కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా... కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం స్పీడ్ బోట్లను తీసుకొచ్చి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. వరద బాధితులను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 30 మంది వరకు చనిపోయారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 15 మంది వరకు మరణించారు

English summary
The weather forecast light to moderate rain over many districts of the state, including Hyderabad for two days,said Hyderabad meteorological department. Just weeks before heavy rains lashes Hyderabad city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X