హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిఫ్ట్‌కు ఆశపడి రూ.85వేలు పోగొట్టుకున్న టాలీవుడ్ భామ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. నైజీరియన్‌ల చేతిలో మోసపోయిన వారి లిస్టులో టాలీవుడ్ నటి సోనాక్షి వర్మ చేరింది.

తల్లి నిర్లక్ష్యం, తండ్రి ఏమరుపాటు .. చిన్నారి మృతితల్లి నిర్లక్ష్యం, తండ్రి ఏమరుపాటు .. చిన్నారి మృతి

తెలుగు నటికి వల

తెలుగు నటికి వల

తెలుగు సినిమాల్లో నటిస్తున్న సోనాక్షి వర్మకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గత నెలలో ఆమె ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు మెర్రిన్ కిర్రాక్ అనే ఓ నైజీరియన్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన సోనాక్షి.. మెర్రిన్ ఎఫ్‌బీ అకౌంట్‌లో పోస్టులు చూస్తుండేది. కొద్ది రోజుల క్రితం మెర్రిన్ తన పర్సనల్ డీటెయిల్స్‌ను సోనాక్షి ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తాను లండన్‌లో ఉంటానని, చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని చెప్పాడు. తమ స్నేహానికి గుర్తుగా చిరు కానుక పంపుతున్నానని చెప్పాడు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి తాను పంపిన బహుమతి ఇంటికి వస్తుందని చెప్పాడు.

రూ.85వేలకు కుచ్చుటోపి

రూ.85వేలకు కుచ్చుటోపి

మెర్రిక్ చెప్పినట్లే గత నెల 27న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు సోనాక్షి వర్మకు ఫోన్ చేశారు. మెర్రిన్ కిర్రాక్ బహుమతి పంపాడని, అందులో వేల డాలర్లు ఉన్నాయని చెప్పాడు. ఆ గిఫ్ట్ బాక్స్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపేందుకు రూ.85వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన సోనాక్షి రూ.85వేలను అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసింది.

సీసీఎస్‌లో కంప్లైంట్

సీసీఎస్‌లో కంప్లైంట్

వారం రోజులు గడిచినా బహుమతి రాకపోవడంతో సోనాక్షి తనకు ఫోన్ వచ్చిన నంబర్‌కు కాల్ చేసి షాకైంది. ఆ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Tollywood heroine sonakshi verma cheated by nigerian. a compliant has been registered in Hyderabad ccs. merrin kirrak sent friend request on facebook to sonakshi verma. then he implemented his plan and allegedly took Rs.85,000 from her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X