హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డెడ్ లైన్..కౌంట్ డౌన్: సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగుస్తోంది: చివరి గంటల్లో ఏం జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన గడువు సమీపిస్తోంది. కౌంట్ డౌన్ మొదలైంది. ఈ అర్ధ్రరాత్రి వరకే వారికి ఉన్న సమయం. కొన్ని చోట్ల స్వల్ప సంఖ్యలో కార్మికులు తిరిగి విధులో చేరుతున్నా రు. కార్మిక సంఘాలు మాత్రం ఈ డెడ్ లైన్లను పట్టించుకోమంటున్నారు. ఇప్పటికే అయిదు వేల ప్రయివేటు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..కార్మికులు నిర్ణీత సమయంలో లోగా విధుల్లో చేరకుంటే మిగిలిన సర్వీసులను ప్రయివేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

ఆ తరువాత ఆర్టీసీ ఉండదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో విధుల్లో చేరే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, రాజకీయ పార్టీలతో జేఏసీ నేతలు సమావేశమవుతున్నారు. కోర్టుల ద్వారానూ మీ సమస్యకు పరిష్కారం లభించదంటూ ప్రభుత్వం న్యాయ పరంగా జరిగే ప్రక్రియను సైతం వివరించింది. దీంతో..సమయం గడస్తున్న కొద్దీ..అటు ప్రభుత్వం..ఇటు జేఏసీ నేతలు..మధ్యలో కార్మికులు ఏం జరుగుతోంది...అర్దరాత్రి లోగా ఏం జరగనుండి. గడువు ముగుస్తే ప్రభుత్వం ఏం చేయనుంది..

TSRTC Strike: కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టినా.. ఎవరూ విధుల్లో చేరలేదు: అశ్వత్థామరెడ్డి, చర్చలకు ఓకేTSRTC Strike: కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టినా.. ఎవరూ విధుల్లో చేరలేదు: అశ్వత్థామరెడ్డి, చర్చలకు ఓకే

డెడ్ లైన్ ఫిక్స్..ఆర్టీసీ భవిష్యత్ ఏంటి..

డెడ్ లైన్ ఫిక్స్..ఆర్టీసీ భవిష్యత్ ఏంటి..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఈ అర్ద్రరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఇక, ఆ తరువాత విధుల్లోకి వచ్చినా తీసుకోరని తేల్చి చెప్పారు. అయినా..కార్మిక సంఘాల జేఏసీ నేతలు మాత్రం వెనుకడుగు వేయటం లేదు. అసలు తమ ఉద్యోగాలు తీసే అధికారం ప్రభుత్వానికి లేదంటున్నారు. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్నారు. న్యాయ పరంగా పోరాడినా తేలేది ఏమీ లేదని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు స్పష్టం చేసింది. విధుల్లో చేరకుంటే ఆర్టీసీ ఇక ఉండదనే సంకేతాలు ఇస్తోంది. స్వల్ప సంఖ్యలో కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చారు.

ముఖ్యమంత్రి హెచ్చరించినా..

ముఖ్యమంత్రి హెచ్చరించినా..

మొత్తంగా 49 వేల మంది కార్మికులు ఉన్న ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఏకపక్షంగా తీసుకోలేదని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో విదుల్లో చేరదలచినవారు తమ లేఖలను తాము పనిచేస్తున్న డిపోల్లో మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా సమర్పించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆయా జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల్లోగానీ, డిపో మేనేజర్‌, డీవీఎం, రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయాల్లోగానీ లేఖలు ఇవ్వవచ్చని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

26 మంది విధుల్లోకి..వారిలోనూ తిరిగి..

26 మంది విధుల్లోకి..వారిలోనూ తిరిగి..

సీఆర్‌ డెడ్‌లైన్‌ విధించినా.. కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రులు రంగంలోకి దిగారు. కార్మికులను విధుల్లో చేరేలా ఒత్తిడి తెస్తున్నారు. తమ అనుచరులు, కార్యకర్తలను కార్మికుల ఇళ్లకు పంపిస్తున్నారు. ముందుగా విధుల్లో చేరాలంటూ రాయబారాలు నడుపుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలో ఒక మంత్రి అనుచరులు ఎక్కువ ఒత్తిడి తెస్తున్నట్లు, ఆ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరినవారిలోనూ కొందరు వెనక్కి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారు.

తాజా పరిస్థితుల పైన సమీక్ష

తాజా పరిస్థితుల పైన సమీక్ష

సోమవారం మరో ఏడుగురు విధుల్లో చేరారు. మరో వైపు ముఖ్యమంత్రి తాజా పరిస్థితుల పైన సమీక్ష చేసారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. దీనిని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5000 రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తుంది. ఆ తెల్లారో, మరునాడో ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది అని ప్రభుత్వ తేల్చి చెబుతోంది.

కేసీఆర్ అన్నంత పనీ చేస్తారా

కేసీఆర్ అన్నంత పనీ చేస్తారా

ప్రభుత్వ వాదన ప్రకారం మ్మె విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీగానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళుతుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుంది. గతానుభవాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో ఒక్కోసారి ఏళ్ల తరబడి కేసుల విచారణ సాగుతుంది. అది అంతం లేని పోరాటమవుతుంది. కాబట్టి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

ఇదే సమయంలో కేసీఆర్ ఇప్పటికే అయిదు వేల ప్రయివేటు బస్సులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేసిన అప్పీల్ ను సైతం తిరస్కరిస్తే.. ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ఇక, గడువు ముగిసినా..కార్మికులు విధుల్లోకి రాకపోతే అన్నంత పనీ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా సమ్మె వ్యవహారంలో రానున్న కొద్ది గంటలు కీలకంగా మారనున్నాయి.

English summary
Cm KCR dead line or RTC workers is now in hours. But, up to now only 26 employees joined in duty. Aftet to day mid night govt analyse the isuse and may take key decision on RTC. Already CM KCR alert the workers ono his future planning in RTC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X