హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాద్ నగర్ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం ... కస్టడీ పిటీషన్ విచారణ నేపధ్యంలో టెన్షన్

|
Google Oneindia TeluguNews

జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంతో తెలంగాణా రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. ఒక పక్క చర్లపల్లి జైలు దగ్గర నిరసన కారులు నిందితులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. భారీ సంఖ్యలో మోహరించిన ఆందోళనకారులు నిందితులకు శిక్ష వెయ్యాలని, దిశ ఘటనకు జస్టిస్ కావాలని నినదిస్తున్నారు. ఇదిలా ఉంటె షాద్ నగర్ కోర్టు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

'దిశ' కేసు ..దోషులను ఉరి తియ్యాలి .. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని విద్యార్థి హల్ చల్'దిశ' కేసు ..దోషులను ఉరి తియ్యాలి .. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని విద్యార్థి హల్ చల్

షాద్ నగర్ వద్ద చోటు చేసుకున్న దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దిశకు న్యాయం చేయాలని, నిందితులకు ఉరే సరి అనే నినాదాలతో దేశం హోరెత్తుతోంది. ఇక ఇదే విషయంపై నేడు పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. ఈ కేసులో మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులుకి 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. చర్లపల్లి జైల్లో ఉన్న వీరిని వేర్వేరు సింగిల్ బ్యారెక్ లలో ఉంచారు . భద్రతారిత్యా వారికి హైసెక్యూరిటీ కల్పించారు . ఒక్కొక్కరికి సెక్యూరిటీగా ఇద్దరు వ్యక్తులను నియమించారు పోలీసులు.

Tension at Shadnagar court in the wake of custody petition hearing

షాద్ నగర్ కోర్టులో నేడు దిశ అత్యాచారం,హత్య కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ పై షాద్ నగర్ కోర్టు విచారణ జరపనుంది. నిందితులను 10 రోజుల కస్టడీకి తమకు అప్పగించాలని పిటిషన్ లో పోలీసులు కోర్టును కోరారు. దిశా కేసులో కస్టడీ పిటిషన్ పై విచారణ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో కోర్టు దగ్గరికి చేరుకోవటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక కోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా భారీగా పోలీసు బలగాలు మోహరించారు.ఇక దిశ అత్యాచారం కేసు నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే లాయర్స్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక ఈ కస్టడీ పిటీషన్ విషయంలో కోర్టు తీర్పు ఏం చెప్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
Shadnagar court today filed a petition seeking custody of the accused in the rape and murder case. In the petition, the police asked the court to hand over the accused to 10 days custody. The locals were alerted to a large number of locals as they approached the court during a custody petition in the Disha case. The police are heavily deployed to prevent any untoward incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X