హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌‌లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారి ప్రాణాలు కాపాడుకోవటానికి వ్యాప్తిని అరికట్టటానికి ప్రయత్నం చేస్తున్నారు.తమ కుటుంబాలకు దూరంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి కాస్త ఉత్సాహాన్ని , బూస్ట్ ను ఇవ్వటంతో పాటు వారికి వారు చేస్తున్న సేవలకు జేజేలు పలుకుతున్నారు ప్రజలు .

Recommended Video

:Lockdown :Considerable Relaxation From Lockdown For Many Districts From May 4

కనువిందు చేస్తున్న లాక్ డౌన్ అద్భుతాలు ....చెంగు చెంగున గెంతుతూ స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులుకనువిందు చేస్తున్న లాక్ డౌన్ అద్భుతాలు ....చెంగు చెంగున గెంతుతూ స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు

ఇక ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై పూల వర్షం కురవనుంది. కరోనా కట్టడిలో వైద్యుల , పోలీసుల పాత్ర ఎనలేనిది. కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న కృషికి దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే కరోనా వారియర్స్ కు కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం నాడు మే 3 వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి.

Thanks to Corona Warriors .. Flowers shower on Gandhi hospital staff by helicopters tomorrow

ఈ మేరకు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల చెప్పిన వివరాల మేరకు కరోనా వారియర్స్‌కు ఘనంగా జేజేలు పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి సేవలకు సపోర్ట్ గా ఉదయం 9.30గంటలకు ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్ల ద్వారా అధికారులు పూలవర్షం కురిపించనున్నారు.

English summary
The role of doctors and police in corona control is immense. The efforts of doctors, sanitation workers and police in the control of corona disease are a nationwide appriciable . Against this backdrop, the Indian Armed Forces are ready to thank the Corona Warriors. Officials will be flown by IAF helicopters at 9:30 am to support the services of those who have been treating corona patients at gandhi hospital .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X