హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ విధంగా రుణం తీర్చుకున్న అదికారులు..!పార‌ద‌ర్శ‌కంగా ఉండాల్సిన వాళ్లే ఏం చేసారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నిక‌ల పోలింగ్ రోజున విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు సంధాన క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించాల్సిన అదికారులు కొన్ని సంద‌ర్బాలో అత్యుత్సాహం చూపిస్తూ అబాసుపాల‌వుతుంటారు. అదికారులు ప్ర‌జ‌ల‌కు మేలు చేద్దామ‌నుకుంటే ప్ర‌భుత్వానికి న‌ష్టం జ‌రుగుతుంది., ప్ర‌భుత్వానికి మేటు చేద్దామనుకుంటే ప్ర‌జ‌ల‌కు న‌ష్టం జ‌రుగుతుంది. ఈ అంశాన్ని మ‌ర్చిపోయి పోలింగ్ సెంట‌ర్ల‌లో అదికారాలు నిర్వ‌హిస్తున్న కొంద‌రు అదికారుల నిర్వాకం వ‌ల్ల అదికార పార్టీ నేత‌ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇంత‌కీ ఆ అదికారులు చేసిన నిర్వాకం ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ఉత్కంఠ న‌డుమ తెలంగాణ ఎన్నిక‌లు..! అదికారుల చేయూత పై విమ‌ర్శ‌లు..!!

ఉత్కంఠ న‌డుమ తెలంగాణ ఎన్నిక‌లు..! అదికారుల చేయూత పై విమ‌ర్శ‌లు..!!

భారీ ఉత్కంఠ నడుమ తెలంగాణ ఎన్నికలు జరిగాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగిసినప్పటికీ.. అక్కడక్కడా చోటుచేసుకున్న సంఘటనలు చూసి, అదికార పార్ట‌లో సందేహాలు క‌లిగిన‌ట్టు కూడా తెలుస్తోంది. నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టీఆర్ఎస్‌కి అంత అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టు కనిపించ‌లేదు. ఈ విషయం టీఆర్ఎస్ పెద్దల‌కు కూడా తెలిసిందేమో! బయటకు మాత్రం 105 సీట్లొస్తాయని చెప్పుకుంటున్న‌ప్ప‌టికి, లోలోపల టీఆర్ఎస్ శ్రేణుల‌ను ఓటమి భయం వెంటాడుతున్న‌ట్టు చ‌ర్చ నడుస్తోంది.

అదికారుల వైఖ‌రిపై విమ‌ర్శ‌లు..! గులాబీ పెద్ద‌ల ప్ర‌మేయం ఉండ‌క‌పోవ‌చ్చు..!!

అదికారుల వైఖ‌రిపై విమ‌ర్శ‌లు..! గులాబీ పెద్ద‌ల ప్ర‌మేయం ఉండ‌క‌పోవ‌చ్చు..!!

ఎలాగైలా గెలవాలనే కసితో ఈ సారి ఈవీఎం లను నమ్ముకోకుండా.. కొత్త కోణంలో అదికార పార్టీ ప్ర‌ణాళిక రచించిన‌ట్టు తెలుస్తోంది. పోలింగ్ అధికారులతో వినూత్న ప్ర‌యోగానికి గులాబీ ద‌ళం తెర తీసిన‌ట్టు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా ఎన్నికల రోజు జరిగిన కొన్ని ఉదంతాలు కూడా చెప్పుకుంటున్నారు. తెలంగాణలోని హాట్ నియోజకవర్గమైన కొడంగల్‌లో 33వ పోలింగ్ బూత్‌లో పోలింగ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధులకు 3వ నెంబర్ బటన్ నొక్కాలని అక్కడి ఎన్నికల అధికారి సూచించినట్లు తెలిసింది.

అదికారుల అత్యుత్సాహం..! చిక్కులు తెచ్చిపెట్టిన అతి విశ్వాసం..!!

అదికారుల అత్యుత్సాహం..! చిక్కులు తెచ్చిపెట్టిన అతి విశ్వాసం..!!

దీంతో ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన సంఘటన, పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది ఈ గుర్తుకు ఓటేయండి అని చెప్పడం... కొన్నిచోట్ల అధికారులే ఓట్లు వేయడం వంటి సంఘటనలు ప్రజలను ఆలోచింపజేశాయని తెలుస్తోంది. హుజుర్ నగర్‌లో ఇలా సరికొత్త విన్యాసాలకు పాల్పడిన ఓ పోలింగ్‌ అధికారిని స్థానికులు చితకబాదారు. ఓ దివ్యాంగుడు ఓ గుర్తుకు ఓటేయమంటే.. ఆ అధికారి మరో గుర్తుకు ఓటేశాడు. అనుమానం రావడంతో ఆ వికలాంగుడు వీవీ ప్యాట్‌ స్లిప్‌ను చెక్‌ చేయడంతో వేరే గుర్తుకు ఓటు వేసాడని స్పష్టం కావడంతో ఆ అధికారిపై స్థానికులు దాడి చేశారు.

అదికారుల త‌ప్పిదాలు..! గులాబీ పార్టీ కి శ‌రాఘాతాలు..!!

అదికారుల త‌ప్పిదాలు..! గులాబీ పార్టీ కి శ‌రాఘాతాలు..!!

అంతే కాకుండా కొందరు అధికారులు వృద్ధులను తప్పుదోవ పట్టించడం కూడా జరిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఓటు ఎలా వేయాలో చెబుతామని చెప్పి వారి బదులు అధికారులే వారికి నచ్చినోళ్లకే ఓటేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ చూస్తుంటే అదికారులు తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి కోట‌రీకి పోలింగ్ లో ఎంత అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారో అర్థం అవుతుంది. ప్ర‌జా స్వామ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు తాత్కాలిక ప్ర‌యోజ‌నాలు ఇచ్చినా దీర్ఘ‌కాలిక న‌ష్టం చేకూరుస్తాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
This time the TRS did not seem to be as positive as compared to the previous elections. The TRS elders know this fact too! While claiming to be 105 out of it, the debate is running out of fear of defeating TRS segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X