హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder: దిశ ఘటన నిందితులు నా నుండి తప్పించుకోలేరన్న రాజా సింగ్ ..కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ లో జరిగిన "దిశ" అత్యాచారం, హత్య ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్న తరుణంలో రాజా సింగ్ కూడా దిశ అత్యాచారం, హత్య కేసు నేరస్తులకు మరణమే సరైన శిక్ష అని పేర్కొన్నారు.

Disha murder: దిశ హత్య నిందితుల ఇంటరాగేషన్ ... విచారణలో గోప్యత !!Disha murder: దిశ హత్య నిందితుల ఇంటరాగేషన్ ... విచారణలో గోప్యత !!

ఇక ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలను చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ దిశ ఘటనలోని నిందితులు ఒకవేళ కోర్టు నుంచి తప్పించుకున్నా లేక జైలు నుంచి తప్పించుకున్నా తన నుంచి మాత్రం తప్పించుకోలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశను ఏ విధంగా అయితే దారుణంగా హత్య చేశారో నిందితులైన ఆ నలుగురికి కూడా అదే శిక్ష పడుతుందన్నారు.

the accused, can not escape from me.. Raja singh comments ... case filed

మహమ్మద్ పేరును ప్రస్తావిస్తూ, ఓల్డ్ సిటీ ముస్లిం ల గురించి మాట్లాడడంతో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బర్కత్ పుర పోలీస్ స్టేషన్లో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే తాను ఇలాంటి కేసులకు భయపడను అని ,తనపై కేసు నమోదు చేసే ముందు పోలీసులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

English summary
Talking about the rape and murder case of Disha , BJP MLA Raja Singh made a sensational statement that accused of the 'Disha' incident could not esacape from me , they may escape from the court and the jail. However, the four men convicted of the brutal murder of Disha will also face the same punishment .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X