India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం.!బస్తీ ఆసుపత్రులను ప్రారంభించిన నగర మేయర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం హైదరాబాద్ మహానగరంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఖైరతాబాద్ మహాభారత నగర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పోరేట్ చికిత్సకు ఏమాత్రం తీసిపోని వైద్యాన్ని అందించే లక్ష్యంతో ఈ బస్తీ దవాఖాలనాలను ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ సద్వినియోగపరుచుకోవాలని మేయర్ సూచించారు.

 పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. ఉచిత చికిత్స కోసమే బస్తీ దవాఖానాలన్న మేయర్

పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. ఉచిత చికిత్స కోసమే బస్తీ దవాఖానాలన్న మేయర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రరంభించిన బస్తీ దవాఖానాల గురించి మేయర్ విజయలక్ష్మి స్పందించారు. నగరంలోని ఆయా స్లమ్ ఏరియాలలో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయంతో బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు విశేష స్పందన వస్తుండడంతో మరిన్ని ఏరియాలో దవాఖానాల ఏర్పాటుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విశేష కృషి చేశారన్నారు మేయర్ విజయ లక్ష్మి.

 అన్ని మురికి వాడల్లో దవాఖానాలు.. పేదలు ఉపయోగించుకోవాలన్న నగర మేయర్

అన్ని మురికి వాడల్లో దవాఖానాలు.. పేదలు ఉపయోగించుకోవాలన్న నగర మేయర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 226 బస్తీ దవాఖానలు ఉండగా నగర వ్యాప్తంగా మరో 32 బస్తీ దవాఖానలకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, మహమూద్ అలి, తలసాని శ్రీనివాస రావు, మల్లా రెడ్డి తమ తమ పరిధిలో గల ప్రాంతాల్లో ఉన్న సంబంధిత నియోజక వర్గ శాసన సభ్యులు బస్తీ దవాఖానాలను ప్రారంభించారని మేయర్ తెలిపారు. బల్దియా పరిధిలో మొత్తం 350 బస్తీ దవాఖానలు ఏర్పాటుకి జిహెచ్ఎంసి ప్రణాళిక రూపొందించినట్లు, అందులో ముందుగా 220 దవాఖానాలు అందుబాటులో ఉండగా, మరో 32 దవాఖానాలను అందుబాటులోకి తెచ్చామని, మిగితా 7బస్తీ దవాఖానాలు మరో వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తామని మేయర్ వెళ్లడించారు.

 బస్తీల్లో వైద్య సౌకర్యాలు లేవు.. పేదలు ఇబ్బందులు పడొద్దనే బస్తీ దవాఖానాలు

బస్తీల్లో వైద్య సౌకర్యాలు లేవు.. పేదలు ఇబ్బందులు పడొద్దనే బస్తీ దవాఖానాలు

దీంతో పాటు నగరంలో 35 కమ్యూనిటీ హాళ్లను గుర్తించడం జరిగిందని, ప్రజల అభీష్టం మేరకు మరో 35 బస్తీ దవాఖానలు ఏర్పాటుకు జిహెచ్ఎంసి ప్రణాళికలను తయారు చేసినట్లు మేయర్ తెలిపారు. పేద ప్రజలకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ 52 పడకల ఆసుపత్రిని త్వరలో ఏర్పాటు చేస్తామని, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆసుపత్రి ఆవశ్యకతను వివరించి మంజూరు చేసేందుకు మేయర్, తాను ఒప్పించామని, మంత్రి హరీష్ ఆసుపత్రి ఏర్పాటుకు హామీ ఇచ్చారని వివరించారు.

 బస్తీ వాసుల్లో హర్షం.. సౌకర్యాలు బాగున్నాయన్న స్దానికులు

బస్తీ వాసుల్లో హర్షం.. సౌకర్యాలు బాగున్నాయన్న స్దానికులు

బస్తీ దవాఖానను పేద ప్రజలు సద్వినియోగంచేసుకోవాలన్నారు మేయర్ విజయ లక్ష్మి. ఈ సందర్బంగా కార్పొరేటర్ విజయ రెడ్డి మాట్లాడుతూ వార్డులో గతంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల పట్ల ప్రజల స్పందన బాగుందని అన్నారు. ఉచితంగా పరీక్షలు, చికిత్స, మందులు, అందించడం మూలంగా బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ వాక్సినేషన్ పక్రీయ పై ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులందరూ మొదటి రెండు డోసులు వేసుకున్న ఇంటికి వ్యాక్షినేషన్ స్టిక్కర్ ను మేయర్ స్వయంగా అతికించారు.

English summary
City Mayor Gadwal Vijaya Lakshmi said that the government's mission was to provide better health care to the poor and that was why Basti dispensaries were set up in the Hyderabad metropolis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X