హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం
జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ తో నువ్వా నేనా అన్నట్లు తల పడుతోంది. ఈరోజు ఉదయం పూట కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో 80 స్థానాల వరకు ఆధిక్యాన్ని కనబరిచిన బిజెపి క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. అయినప్పటికీ చాలా స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇస్తుంది బిజెపి . ప్రస్తుతం ఇంకా గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఇప్పటివరకు బీజేపీ 24 చోట్ల విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.
గ్రేటర్ లో గులాబీ హవా.. పాలాభిషేకాలు , సంబరాలు షురూ .. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే ..

చైత్నయపురిలో విజయం సాధించి ఖాతా తెరిచిన బీజేపీ
ముస్లిం వోటు బ్యాంకు ఎక్కువగా ఉండే స్థానాల్లో కూడా బిజెపి ఎంఐఎం కు గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.
గ్రేటర్ ఎన్నికల్లో చైతన్యపురి లో విజయం సాధించి బీజేపీ ఖాతా తెరిచింది. చైతన్యపురి బిజెపి అభ్యర్థి రంగ నరసింహ గుప్తా తన ప్రత్యర్థులపై విజయం సాధించారు. అధికార పార్టీ అభ్యర్థి పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అటు చంపాపేట్ లోని బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అడిక్ మెట్ లో సునీత ప్రకాష్ గౌడ్ , గచ్చిబౌలిలో గంగాధర్ రెడ్డి ,ముషీరాబాద్ లో సుప్రియ గౌడ్ విజయకేతనం ఎగురవేశారు.

మూసరాం బాగ్ , హబ్సి గూడ , జీడిమెట్ల బీజేపీ విజయాల నమోదు
హస్తినాపురం డివిజన్ సైతం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. బిజెపి అభ్యర్థి సునీత నాయక్ 278 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. ఇక హబ్సిగూడ డివిజన్ లో బిజెపి అభ్యర్థి చైతన్య విజయం సాధించారు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి భేతి స్వప్నపై చైతన్య విజయం సాధించారు. ముసరాంబాగ్ నుంచి భాగ్యలక్ష్మి, జీడిమెట్ల నుంచి సిహెచ్ తారా చంద్రారెడ్డి విజయం సాధించి బిజెపి ఖాతాలో ఆ స్థానాలను చేర్చారు .

చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ .. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ ఓటు బ్యాంకు
ఎల్బి నగర్, మహేశ్వరం, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో మెజారిటీ స్థానాలు వస్తాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే బిజెపి ఇప్పటివరకు ఎన్నికలలో 24 చోట్ల విజయాన్ని సాధించి 12 కీలక స్థానాలలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏదేమైనా గతంతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి ఓటు బ్యాంకు అనూహ్యంగా పుంజుకుందని తెలుస్తుంది.