• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్రహోంశాఖ ... పదవులకు అనర్హుడంటూ...ఉత్తర్వులు

|

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడంటూ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎలాంటీ పదవులు పొందడానికి అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కోంది. ఎమ్మెల్యే పదవిని కూడ పొందడానికి వీలు లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

 మరోసారి పౌరసత్వ వివాదం

మరోసారి పౌరసత్వ వివాదం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆయన భారత పౌరుడు కాదంటూ... కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పౌరసత్వం విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన భారత పౌరుడా కాదా అనే అంశాన్ని తేల్చాల్చింది కేంద్ర హోంశాఖ అంటూ పేర్కోంది. అయితే ఇదే అంశంపై పిటిషనర్ ఆది శ్రీనివాస్ సుప్రీం కోర్టును కూడ ఆశ్రయించారు. అక్కడ కూడ ఇదే రకమైన తీర్పు వెలువడింది. ఉన్నత న్యాయ స్థానం సైతం హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో హోంశాఖ నిర్ణయం

సుప్రీం కోర్టు తీర్పుతో హోంశాఖ నిర్ణయం

సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో కేంద్రహోంశాఖ రమేశ్ పౌరసత్వానికి సంబంధించిన విచారణ చేపట్టింది. అందుకు సంబంధించిన వివరాలను పిటిషనర్ ఆది శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే రమేష్ నుండి కూడ వివరాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పౌరసత్వం చెల్లదంటూ కీలక నిర్ణయం తీసుకుంది. రమేశ్ భారత పౌరుడు కాదంటూ పేర్కోంది. దీంతో దేశ పౌరులకు ఉండే ఎలాంటీ అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని స్పష్టం చేసింది.

ఎమ్మెల్యే పదవికి అనర్హుడు

ఎమ్మెల్యే పదవికి అనర్హుడు

ఆయన నిబంధలకు విరుద్దంగా దేశంలో ఉంటున్నాడని చెప్పింది. దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని పేర్కోంది. అయితే గతంలో కూడ అమెరికా నుండి వీసా పొందే క్రమంలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించారని తెలిపింది. భారత్‌కు వచ్చిన అనంతరం కూడ చాలా కాలం పాటు అమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్దరించుకోకుండా వ్యవహరించారని పేర్కోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవిని కూడ పోందడానికి అవకాశాలు లేవని హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కోంది.

స్పందించిన ఎమ్మెల్యే రమేశ్

స్పందించిన ఎమ్మెల్యే రమేశ్

అయితే పౌరసత్వ రద్దుపై ఎమ్మెల్యే రమేష్ స్పందించారు. హోంశాఖ నిర్ణయంపై కోర్టుకు వెళతానని చెప్పారు. ఈ వివాదంలో రాష్ట్ర హైకోర్టు గత జూలై 15 స్పష్టమైన తీర్పును వెలువరించిందని, అయితే కోర్టు ఆదేశాలను కేంద్ర హోంశాఖ పట్టించుకోలేదని ఆయన తెలిపారు. కేంద్ర హోంశాఖ 2017లోనే పౌరసత్వాన్ని రద్దు చేయడంతో విచారించిన హైకోర్టు స్టేను విధించి, అనంతరం 2019 జూలైలో తుది తీర్పును వెలువరించిందని చెప్పారు. ఒకవేళ హోంశాఖ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసిందని రమేష్ వివరించారు. దీంతో తనకు కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులుగా ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్యే రమేష్

రాజకీయ ప్రత్యర్థులుగా ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్యే రమేష్

కాగా రమేశ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుండి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మూడు సార్లు పోటీ చేసి గెలుపోందాడు. అప్పటి నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుసగా ఆయన అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి ఉండి గెలుపోందారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆది శ్రీనివాస్ చిరకాల ప్రత్యర్థిగా ఆయనపై పోటి చేస్తూ... వరుసగా ఓటమీ పాలు అవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. కాగా ఆది శ్రీనివాస్ గత అసెంబ్లీ ముందు కోద్ది రోజులపాటు బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుని పోటి చేశారు.

English summary
TRS MLA Chennamaneni Ramesh gets shock by the Union Home Ministry. The Center has cancelled of his Indian citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X