• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కంపు కొడుతున్న కామెడీ.!దిగజారీపోతున్న విలువలు..!హాస్యం పేరుతో ఏహ్యం కలిగిస్తున్న జబర్థస్త్ టీం.!

|

హైదరాబాద్ : నిత్యం రోజూవారీ దినచర్యలతో బోర్ ఫీల్ అవుతూ యాంత్రిక జీవనాన్ని అనుభవిస్తున్న ప్రజానికానికి టీవి పేరుతో కాస్తో కూస్తో ఉపశమనం లభించేది. ఇటీవల ప్రసారమవుతున్న కార్యక్రమాలు, కామెడీ షోలు, కాస్త వినోదాన్ని పంచుతున్నప్పటికి అదే రంగంలో నెలకొన్న పోటీ వల్ల కార్యక్రమాలు వాటి స్టాండడ్స్ ని కోల్పోతున్నాయి.

పోటీ తట్టుకుని షోని రక్తికట్టించేందుకు దిగజారుడు మార్గాలను కూడా కొంతమంది ఈ మద్య పుట్టుకొచ్చిన కళాకారులు మొహమాటం లేకుండా ఆచరిస్తున్నారు. టీవి ముందు కూర్చున్న ప్రేక్షలకులను నవ్వించాల్సింది పక్కన పెట్టి ఎవరు వేసుకున్న జోకులకు వారే నవ్వుకోవడం, హాస్యంలో నైతికవిలువలు లేకపోవడం టీవీ చూసే ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తున్నాయి.

విసుగెక్కువ.. వినోదం తక్కువ..

విసుగెక్కువ.. వినోదం తక్కువ..

ఇటీవల వినోదాత్మకం పేరుతో అనేక టీవి ఛానళ్లు రూపొందింస్తున్న కార్యక్రమాలు వినోదం కన్నా విసుగును ఎక్కువాగా పంచుతున్నట్టు సగటు తెలుగు ప్రేక్షకుడు నొచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. కొత్తదనాన్ని ప్రోత్సహించే క్రమంలో చాలా వరకు చౌకబారు కామెడీని ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నట్టు నిర్దారణ అవుతోంది. కార్యక్రమంపట్ల అవగాహన, అంకింత బావం లేకపోవడం, ఏదో చేసి చూపించాలనే ఆతృతలో అసలు అంశం పక్కదారిపుడుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కార్యక్రమాల రూపకల్పనలో నెలకొన్న పోటీ వల్ల నాణ్యతపడిపోతున్నట్టు తెలుస్తోంది.

 పడిపోయిన ప్రమాణాలు...

పడిపోయిన ప్రమాణాలు...

ఒకప్పుడు జబర్ధస్త్ అంటే ఆరోగ్యకరమైన హాస్యంతో ఆహ్లాదంగా ముందుకు సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేది. కాని ఇప్పుడు అదే కార్యక్రమంలో మహిళా వేశధారణలో ఉన్న కళాకారులను ఎంత కించపరిస్తే, ఎంత నీచంగా సంభోదిస్తే ప్రేక్షకులు అంతే నవ్వుతారనే అపోహలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే పరంపరలో హాస్య సన్నివేశం మొత్తం పక్కదారిపడిపోతున్న అంశాన్ని సదరు ఆర్టిస్టులు పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు ఇదే జబర్ధస్త్ వేదిక మీద పరిమిత సంఖ్యలో కళాకారులు కనిపించే వారు. ప్రస్తుతానికి డజన్లకొద్ది మగవారు ఆడ గెటప్ లో నవ్వించేందుకు ప్రసవవేదన అనుభవిస్తున్నట్టు నిర్దారణ అవుతోంది.

 అంతా ఒకటే కామెడీ..

అంతా ఒకటే కామెడీ..

ఇక ఏళ్ల తరబడి సీరియస్ నెస్ ను హాస్యానికి ముడిపెడుతూ, ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రేక్షకులకు భ్రమలు కలిగిస్తున్నూనే ఉన్నారు రేష్మి, సుధీర్ జంట. అసలు వాల్ల మద్య లేని కెమిష్ట్రీని ఉన్నట్టు చూపించి వినోదాన్ని పంచాలనుకోవడం పెద్ద దరిద్ర్యమైన అంశంగా చర్చ జరుగుతోంది. ఆది లాంటి నవ్వించగలిగే వాళ్లు కూడా నాసిరకం హాస్యాన్ని రుద్దడం బాధగా ఉంది. ఇక యాంకర్ మాచిరాజు ప్రదీప్ తన దగ్గర ఉన్న స్టఫ్ అయిపోయింది అన్నట్టు ఈ మద్య చేస్తున్న షోల ద్వారా అర్దం అవుతోంది. చెప్పిందే చెప్పి, వేసిన జోకులనే వేస్తూ విసుగుపుట్టిస్తున్నాడు తప్ప కాలంతో అప్డేట్ మాత్రం కావడం లేదు.

ఈ జడ్జీలు ఉన్నారే..

ఈ జడ్జీలు ఉన్నారే..

ఇక జడ్జ్ మెంట్ ఇవ్వాల్సిన మన సెలబ్రిటీ జడ్జ్ లు మాత్రం వందకు వంద శాతం అలంకారప్రయాంగానే వ్యవహరిస్తుంటారు. కామెడీ షోకు సంబందించిన సరైన నిర్ణయాన్ని ఏ ఎపిసోడ్ లోనూ చెప్పరుగాక చెప్పరు. ఇక ఇటీవల ఓంకార్ రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో జడ్జీలు ఎవరో, పార్టీసిపెంట్స్ ఎవరో చెప్పడం కష్టంగా మారింది. పది, పదిహేను మంది జడ్జీలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఏం నిర్ణయం చెప్తున్నారో అంతా అయోమయమే. అన్నిటికన్నా మించి ఎక్కువ ప్రజాధరణ పొందిన జబర్ధస్త్ లాంటి షోలో మాత్రం ఇటీవల వస్తున్న హాస్యం దిగజారిపోయిన ప్రమాణాలకు అద్దంపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary
Deteriorating values.! Jabarthast team in the name of humor.!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X