హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బక్రీద్: మానవత్వానికి సూచిక.. ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లీం సోదరులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మానవత్వానికి, త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈద్ అల్ అద్హా అని కూడా పిలిచే బక్రీద్ ముందు రోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. ఖుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని భావిస్తారు.

త్యాగానికి ప్రతిరూపం బక్రీద్..! నగరంలో పండగ వాతావరణం..!!

త్యాగానికి ప్రతిరూపం బక్రీద్..! నగరంలో పండగ వాతావరణం..!!

ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లాను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం 'కాబా' ను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందుతారు. ఇబ్రహీం దంపతులకు చాలా కాలం సంతానం కలగదు. లేకలేక పుట్టిన కొడుక్కి ఇస్మాయిల్‌ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు ఓ రోజు ఇబ్రహీంకు కల వస్తుంది. అల్లా ఖుర్భానీ కోరుతున్నాడమోనని భావించి ఒంటెను బలిస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది.

 ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలు..! అల్లా చూపిన భాటలో మైనారిటీ సోదరులు..!!

ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలు..! అల్లా చూపిన భాటలో మైనారిటీ సోదరులు..!!

దీంతో అల్లాహ్ తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా.. అల్లా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం సిద్ధపడగా.. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింలు నమ్ముతారు.

మేక మాంసం ప్రత్యేకత..! ప్రతి ఇంట్లో ఉండాల్సిందే..!!

మేక మాంసం ప్రత్యేకత..! ప్రతి ఇంట్లో ఉండాల్సిందే..!!

బక్రీద్ రోజున మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ముస్లిం క్యాలెండర్ చంద్రుడి గమనం ఆధారంగా సాగుతుంది. ముస్లిం క్యాలెండర్‌లోని చివరి మాసమైన ధు అల్-హిజాహ్ పదో రోజున ఈద్ అల్ అద్హాను జరుపుకొంటారు. అదే సమయంలో హజ్ యాత్ర కూడా జరుగుతుంది. ఈ ఏడాది బక్రీద్ ఆగష్టు 12న వచ్చింది. బక్రీద్ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు.

 పేద ముస్లింలకు ఖుర్బాని..! మానవత్వం చాటే పండగ..!!

పేద ముస్లింలకు ఖుర్బాని..! మానవత్వం చాటే పండగ..!!

ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే, ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం, ఇవి అల్లాకు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. అల్లా నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఖుర్భాని వడ్డీతో కూడిన రుణం ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు.

English summary
Muslims celebrate the festival of Bakrid, which is considered a symbol of humanity and sacrifice. Bakrid, also known as Eid al-Adha, is placed on their favourite dresses and food items at the tombs of Muslims who died earlier in the day. By doing so, they believe they will accept them from heaven.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X