హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ స్కెచ్ వేసి పనిమనిషిని పట్టుకున్నారు .. ఆ మొత్తం ఎంతంటే.. ఈ క్రియేటివిటీ పెద్ద కేసుల్లో లేదేం

|
Google Oneindia TeluguNews

భారీ స్కెచ్ వేసి ఓ పనిమనిషి దొంగతనం చేసిందని గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. అయితే ఓ పనిమనిషి విషయంలో చూపించిన చాకచక్యం, క్రియేటివిటీ పెద్ద పెద్ద నేరాల విషయంలో పోలీసులు ఎందుకు చూపించడం లేదో అర్థం కాని పరిస్థితి. అలా ప్రతి నేరం లోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా నేరాలు జరక్కుండా అని చెక్ పెట్టొచ్చు.
దొంగతనం చేయడం తప్పే... అలా దొంగతనం చేసిన ఒక మహిళను ఓ ఇంటి యజమాని పోలీసులు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.

<strong> బీజేపీ నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్.. రైతు కష్టాలు అందుకే? కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్న ఎంపీ!</strong> బీజేపీ నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్.. రైతు కష్టాలు అందుకే? కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్న ఎంపీ!

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయని అనుమానించిన యజమాని ఇంట్లో డబ్బులు తీసుకున్న ఇంటి దొంగలు పట్టుకోవాలని పక్కా స్కెచ్ వేశారు. ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ఎప్పటిలాగే ఆ నోట్లూ పోయాయి. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో ఇంట్లోని పనిమనుషులను విచారించిన పోలీసులు అసలు దొంగను పట్టుకున్నారు.

The maid caught by a huge sketch in hyderabad

బంజారాహిల్స్‌ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సింగాడీ బస్తీలో నివసించే ఉప్పరి అఖిల బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే భీంరెడ్డి పటేల్‌ ఇంట్లో గత ఆరు నెలలుగా పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా భీంరెడ్డి ఇంట్లో డబ్బులు పోతుండడంతో ఎవరు తీస్తున్నారో అర్థంకాక ఆ ఇంటి యజమాని అయోమయానికి గురి అయ్యాడు. డబ్బు ఎవరు కాజేస్తున్నారో గుర్తించేందుకు యజమాని రూ.2100 గదిలో పెట్టి ఆయా నోట్ల నంబర్లను రాసుకున్నాడు. ఇక దీంతో కొద్ది సేపటికే డబ్బులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నోట్ల నెంబర్లను రాసి పెట్టుకున్న యజమాని ఆ నంబర్లను పోలీసులకు ఇచ్చారు. యజమాని ఇచ్చిన నోట్ల నంబర్లతో సరిపోలిన నోట్లు అఖిల వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చివరికి దొంగతనం చేసినట్లు ఆ పనిమనిషి అంగీకరించడంతో ఆమె వద్ద నుండి రూ. 16,500 స్వాధీనం చేసుకుని, నిందితురాలిని రిమాండ్‌ కు పంపారు బంజారాహిల్స్‌ సీఐ రవికుమార్‌ .

ఇంటి యజమాని, పోలీసులు ప్రదర్శించిన నైపుణ్యం, తెలివి చాలామంది బడా నేతల విషయంలో ప్రదర్శించి ఉంటే దేశాన్ని దోచుకోవడం కాస్తయినా తగ్గి ఉండేది. చిన్నవాడు చిన్న తప్పు చేసే అది దారుణమైన నేరం. అదే పెద్ద వాళ్ళు, బడా రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు దోచేసిన అడిగే నాథుడే లేడు. ఇలాంటి తెలివిని ప్రదర్శించి, వారిని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చేసేలా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయడం లేదనే భావన ఈ కేసు గురించి విన్న ప్రజల్లో కలుగుతుంది.

English summary
An owner of an MLA colony at Banjarahills Road No. 12 has sketched the owner's suspicions that he is trying to catch the house thieves. This time he prefixed the numbers on the notes. As usual those notes are gone. He complained to the police. police Investigated the house maids . then they caught the original thief by tally the notes numbers .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X