• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ‌లో క్రిస్ట‌మ‌స్ ఆఫ‌ర్ మిస్ చేసుకున్న ఆ ఆమ్మెల్యేలు..! ఐనా సంక్రాంతి ఆఫ‌ర్ రెడీ..!!

|

తెలంగాణ‌లో అదికార గులాబీ పార్టీకి అత్య‌దిక మెజారిటీ వ‌చ్చిన‌ప్ప‌టికి ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌కు గాలం వేయ‌డం మాత్రం మాన‌డం లేదు. గులాబీ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి నెల రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్ట‌డం లేదు. అత్తెస‌రు సీట్లు సాధించుకుని అంత‌ర్మ‌ద‌నానికి లోనౌతున్న ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌ను కూడా క‌లుపుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది అదికార పార్టీ. అందులో భాగంగా ఖ‌మ్మం జిల్లాలో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో సంప్ర‌దింపులు కొన‌సాగిస్తూ అందివ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను ఎర‌గా వేస్తున్న‌ట్టు స‌మాచారం..! ఇంత‌కీ ఎవ‌రా ఎమ్మెల్యేలు..? ఏంటా ఆఫ‌ర్..? తెలుకునే ప్రయత్నం చేద్దాం..!!

ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌కు టీఆర్ఎస్ గాలం..! ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్యేల‌కు వినూత్న ఆఫ‌ర్..!!

ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌కు టీఆర్ఎస్ గాలం..! ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్యేల‌కు వినూత్న ఆఫ‌ర్..!!

తెలంగాణలో ఎన్నికలు ముగిసినా, రాజకీయాలు, బేర‌సారాలు, ఆదిప‌త్య దోర‌ణి మాత్రం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఓటమి బాధతో అన్ని పార్టీలు ఆవేద‌న‌లో ఉండగా, ముందస్తు ఎన్నికల్లో గెలిచినా గులాబీ పార్టీకి మాత్రం అంత‌గా సంతృప్తిగా లేదనే సంకేతాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే మేజిక్ ఫిగర్‌కు మించి ఎమ్మెల్యేలు ఉన్నా.. పక్క పార్టీల వారిపైపు చూస్తోంది ఆ పార్టీ అధిష్ఠానం. దీనికితోడు, ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఖ‌మ్మం జిల్లాలో పావులుక‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏం కాలం వ‌చ్చెరా వారీ..! హ‌రిదాసులు కూడా మోడ్ర‌న్ గా మారిపోయే..! ఏం కాలం వ‌చ్చెరా వారీ..! హ‌రిదాసులు కూడా మోడ్ర‌న్ గా మారిపోయే..!

ఖ‌మ్మంలో గెలిచిన ఇద్ద‌రు టీడిపి అభ్య‌ర్థులు..! త‌మ పార్టీలో చేర‌మ‌ని టీఆర్ఎస్ ఒత్తిడి..!!

ఖ‌మ్మంలో గెలిచిన ఇద్ద‌రు టీడిపి అభ్య‌ర్థులు..! త‌మ పార్టీలో చేర‌మ‌ని టీఆర్ఎస్ ఒత్తిడి..!!

ముంద‌స్తు ఎన్నికల్లో టీడిపి తరపున సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు. గులాబీ పార్టీలో చేరితే సండ్రకు మంత్రి పదవి కేటాయిస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకురావాలని షరతు పెట్టినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ నేతలు మరో ఎమ్మెల్యేకు కూడా అదిరిపోయే ఆఫర్ ప్రకటించారని స‌మాచారం.

మెచ్చాతో తుమ్మ‌ల భేటీ..! స‌మ‌యం కావాల‌న్న టీడిపి ఎమ్మెల్యే..!!

మెచ్చాతో తుమ్మ‌ల భేటీ..! స‌మ‌యం కావాల‌న్న టీడిపి ఎమ్మెల్యే..!!

రెండు రోజుల క్రితం మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీడియాలో మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారిపోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. మీడియాలో వ‌చ్చిన వార్త‌ల అనంత‌రం పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. తన రాజకీయ గురువు, తన ఎదుగుదలకు కారణమైన తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు నాగేశ్వ‌ర రావు వివ‌ర‌ణ ఇచ్చారు.

పార్టీ మారేది లేదంటున్న తెలుగు త‌మ్ముళ్లు..!కానీ గులాబీ ఆఫ‌ర్లు క‌వ్విస్తున్నాయంటున్న ఎమ్మెల్యేలు..!!

పార్టీ మారేది లేదంటున్న తెలుగు త‌మ్ముళ్లు..!కానీ గులాబీ ఆఫ‌ర్లు క‌వ్విస్తున్నాయంటున్న ఎమ్మెల్యేలు..!!

తాజాగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు ఈ మ‌ద్య తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ కలిశారనే వార్త జిల్లా రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కానీ, మెచ్చా, తుమ్మల క‌ల‌యిక వెన‌క రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. అదికార పార్టీలో చేరవలసిందిగా ఈ సందర్భంగా తుమ్మల మెచ్చాను కోరిన‌ట్టు తెలిసింది. అందుకుగానూ, ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీనిపై మెచ్చా వెంట‌నే సానుకూలంగా స్పందించ‌కుడా తనకు సమయం కావాలని కోరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో అదికార పార్టీ చూపిస్తున్న ఏ ఆఫ‌ర్ల‌కి టీడిపి నేత‌లు సై అంటారో ఉత్కంఠ‌గా మారింది.

English summary
While elections in Telangana are over, politics, bargaining and precedent are going on at the same level.While all parties are losing their defeat, it seems that the pink party is not satisfied with winning the pre-election campaign. That's why the MLAs are beyond the magic figure .. That party is the overlap of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X