హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటోలతో పాటు నోట్లు ప్రింట్ చేస్తున్నారు .. సిద్దిపేటలో నకిలీ నోట్ల ముఠా.

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట : తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురాశ వారిని కటకటలపాలు చేసింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారు నకిలీ నోట్ల ప్రింట్ చేసే పనిని ఎంచుకుని .. ఊచలు లెక్కిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నకిలీ నోట్ల ముఠా చెలామణి ఎక్కువైంది. ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా నోట్లు పెరగడంతో శాంతి భద్రతల విభాగం పోలీసులు అసలీ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎవరు తయారుచేస్తున్నారనే కోణంలో విచారణ చేయగా .. ముఠా గుట్టు రట్టయ్యింది.

సూత్రధారి .. పాత్రధారి అటెండర్
సిద్దిపేట అంబేద్కర్ నగర్ కు చెందిన గ్యాదరి బాలకృష్ణ నంగునూరు పీహెచ్‌సీలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అతడి ఫ్రెండ్ చింతల హరినాధ్ మద్దూరు గ్రామం. అతనికి ఫొటో స్టూడియో ఉంది. వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించారు. 5 నెలల క్రితం నకిలీనోట్లు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. నోట్ల ముద్రణకు కావాల్సిన కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, పేపర్ కట్టర్, కలర్ ను హైదరాబాద్ లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ ఇంట్లోనే రూ.500, రూ.200, రూ.2000 వేల నోట్లతో రూ.మూడున్నర లక్షలను ముద్రించారు. వీరి ముఠాలో సిద్దిపేటకు చెందిన బోయగూడ అశోక్ చేరాడు. వీరు ముగ్గురు మరో ముగ్గురి సాయం తీసుకొని నకిలీ నోట్లను చెలామణి చేశారు.

The notes are printed along with photos. A gang of fake notes in Siddipet

ముఠా గుట్టు తెలిసిందిలా ..
ఇటీవల సిద్దిపేట, చేర్యాలలో నకిలీ నోట్లు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు నిఘా పెట్టారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి ఆద్వర్యంలో స్పెషల్ టీం రంగంలోకి దిగంగా బాలకృష్ణ అండ్ కో చేస్తున్న నిర్వాకం బయటపడింది. బాలకృష్ణ, హరినాథ్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అశోక్ పరారీలో ఉన్నాడని .. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నకిలీ నోట్ల ముఠా నుంచి ప్రింటింగ్ మిషన్లు, రూ.89,200 నకిలీ నోట్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో నలుగురి సహకారం ..
ఈ ముగ్గురికి మరో నలుగురు తోడయ్యారు. సిద్దిపేట బోయిగల్లీకి చెందిన సురేశ్, మద్దూరుకు చెందిన పల్లెపు సాయికుమార్ .. అదే మండలం గాగిల్లాపూర్ కు చెందిన సుంకోజి శ్రీశైలం, జాలపల్లికి చెందిన గిరి గోవర్ధన్ రెడ్డి, కూటిగల్ కు చెందిన బండి రఘు రూ.2 లక్షల నకిలీ నోట్లను చెలామణి చేశారు. ఈ వ్యవహారం గత నెల 10న వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై ఏర్పాటైన ప్రత్యేక టీం విచారిస్తే .. నకిలీ నోట్లు ముఠా వ్యవహారం బయటపడింది.

English summary
Gadari Balakrishna of Ambedkar Nagar is working as an attendant at Nangur Peak. His friend was Chintila Harinadh Adondur village. He has a photo studio. They both think about how to make money easily. 5 months ago decided to make counterfeits. The computer, printer, scanner, paper cutter, color for the printing of the notes was purchased in Hyderabad. Later, Balakrishna printed Rs. 500, Rs. 200, and Rs.2,000 They joined the booguda Ashok of Siddipet in the gang. Three of the three arrested and fake notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X