హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గంలో బీసీల ప్రాధాన్యమేదీ ? లిస్ట్ లో తక్కువ ఉన్నారంటోన్న బీసీ సంక్షేమ సంఘం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ బీసీల్లో కాక రేపుతోంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ .. మంత్రివర్గంలో ప్రయారిటీ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. 8 నుంచి 10 మంది పేర్లలో బీసీ అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతుతోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం చేయాలని బీసీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది.

అగ్రకులాలకు ఇంపార్టెన్స్ ..?

అగ్రకులాలకు ఇంపార్టెన్స్ ..?

రాష్ట్రంలో బీసీలు ఎప్పుడు అన్యాయనాకి గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో కూడా బీసీలు ఆశించిన మేర పదవులు దక్కలేవన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాలకు 50 శాతం పదవులు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ... మళ్లీ అగ్రకులాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతల్లో బీసీలు తక్కువగా ఉన్నారని వాపోయారు.

50 శాతం ఉన్న 5 శాతం పదవులా ...?

50 శాతం ఉన్న 5 శాతం పదవులా ...?

రాజ్యాధికారంలో బీసీలు ఎప్పుడు నిరాధరణకు గురవుతూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైతే .. తెలంగాణలో బలహీనవర్గాలైన బీసీలు అణచివేతకు గురవుతున్నారన్నారు జాజుల. రాష్ట్రంలో 5 శాతం ఉన్న రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య ఇతర అగ్రకుల నేతలకు 50 శాతం పదవులు దక్కుతున్నాయని మండిపడ్డారు. దీనిపై తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే ... సామాజిక సమీకరణాలు ... జిల్లాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు 50 శాతం ఉంటే కేవలం 5 శాతం పదవులే కట్టబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారాయన.

సామాజిక న్యాయం ఏదీ ..?

సామాజిక న్యాయం ఏదీ ..?

అధికార పార్టీలో ఉన్న బీసీ నేతలకు ఎందుకు క్యాబినెట్ లో చోటు కల్పించరని నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం బీసీల పదవులను అగ్రవర్ణాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. వివిధ అంశాల్లో లేని సామాజిక న్యాయం ... మంత్రివర్గ కూర్పులో కూడా ఉండదా అని కొశ్చన్ చేస్తున్నారు. సామాజిక న్యాయం ప్రకారం బీసీల రాజ్యాధికారం బీసీలకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్వాసన వెనక కారణమేంటీ ...?

ఉద్వాసన వెనక కారణమేంటీ ...?

మరోవైపు బీసీ నేత అయిన ఈటల రాజేందర్ కు క్యాబినెట్ లో చోటు దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఆయన బదులు కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్ కు చోటు ఖాయమనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఈటలకు ఎందుకు చోటు ఇవ్వరని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

English summary
The Telangana Cabinet expansion is in addition to Bees. The CM KCR, who said that BCs should be given priority. There is a campaign to announce that Bc candidates are low in 8 to 10 names. Demand comes from BC leaders to make social justice in cabinet expansion. BSc welfare committee state president Jazula Srinivas Goud said that when the Bc were in the state of injustice, In the past also BCs have been given the rank of the expected. KCR, who announced 50 per cent positions for the weaker sections of the state, has repeatedly said that the upper castes are preferred. Tuesday's swearing-in ministers are the lowest of the BCs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X