హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్ హీరో సోనూ సూద్: వారిక అనాథలు కాదు, ఆ ముగ్గురు పిల్లల బాధ్యతా ఆయనదే

|
Google Oneindia TeluguNews

ముంబై/హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బతుకులు మరింత దయనీయంగా మారాయి. వలస కార్మికుల బాధలు చూసి చలించిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ వారికి సాయం చేయడం మొదలుపెట్టారు.

రియల్ హీరో..

రియల్ హీరో..


నాటి నుంచి నేటి వరకు అడిగినవారికి, అడగనివారికి కూడా సాయం చేస్తూనే ఉన్నారు ఈ రియల్ హీరో. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూ సూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. దీంతో వారంతా సోనూ సూద్‌ను తమ పాలిట దేవుడిగా భావించారు.

వారందరికీ ఉపాధి..

వారందరికీ ఉపాధి..

ఇప్పుడు ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తాను ఉపాధి చూపిస్తానంటూ సోనూ సూద్ భరోసా కల్పిస్తుండటం గమనార్హం. సుమారు 3 లక్షల మందికి వివిధ సంస్థల సాయంతో ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సోనూ సూద్ వెల్లడించారు. తన సాయం ఎవరికి ఉన్న తనవంతుగా భరోసా కల్పిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

తిరుపతిలో తనకో కుటుంబం..

తిరుపతిలో తనకో కుటుంబం..

కాగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి సోనూ సూద్ తన ఆపన్న హస్తాన్ని అందించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పేద రైతు నాగేశ్వరరావు తన కూతుళ్ల సాయంతో పొలం దున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు చూసిన సోనూ సూద్.. ఆ కుటుంబానికి వెంటనే ట్రాక్టర్ కొనిచ్చారు. తనకు తిరుపతిలో ఓ కుటుంబం దొరికిందంటూ వ్యాఖ్యానించారు.

Recommended Video

తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు | Private Hospitals దుర్మార్గం || Oneindia Telugu
సాఫ్ట్‌వేర్ శారదకు మళ్లీ ఉద్యోగం

సాఫ్ట్‌వేర్ శారదకు మళ్లీ ఉద్యోగం

ఇక తెలంగాణకు చెందిన శారద అనే అమ్మాయికి ఉద్యోగం ఇప్పించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో శారద పనిచేస్తున్న ఐటీ సంస్థ.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రితోపాటు కూరగాయలు అమ్ముతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన సోనూ సూద్ ఆమెకు కూడా సాయమందించారు.

వారిక అనాథలు కాదు..


తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకురుకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలకు అండగా ఉంటానని ప్రకటించారు సోనూ సూద్. ఆత్మకూరుకు చెందిన సత్యనారాయణ, అనురాధకు ముగ్గురు సంతానం. కాగా, తండ్రి సత్యనారాయణ ఏడాది క్రితం మరణించారు. తల్లి అనురాధ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ ముగ్గురు సంతానం కూడా అనాథలుగా మిగిలిపోయారు. వారి పరిస్థితి చూసి చలించిన సోనూ సూద్.. ఆ ముగ్గురి బాధ్యత తనదేనని ప్రకటించారు.
తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడు మనోహర్ తన చెల్లి, తమ్ముడి ఆలనాపాలనా చూస్తున్నాడు. సోనూసూద్ ఈ ముగ్గురికి అండగా ఉంటానని చెప్పడంతో నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

English summary
They are no longer orphans: Sonu sood on three telangana orphan children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X