• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలీసులా..? కిడ్నాపర్లా.. జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌పై భగ్గుమన్న ఇందిరా

|
Google Oneindia TeluguNews

జర్నలిస్టు రఘును అరెస్టు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కిడ్నాపర్ల మాదిరిగా తీసుకెళ్లడం దారుణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తీవ్రంగా తప్పుపట్టారు. జర్నలిస్ట్ రఘు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీసీ టీవీ విజువల్స్ సమాజం విస్తుపోయేలా ఉన్నాయన్నారు. ఒక ఉగ్రవాది, తీవ్రవాదిలా రఘు పట్ల పోలీసులు పాశవికంగా ప్రవర్తించడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.

నియంతృత్వ పాలన

నియంతృత్వ పాలన


తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విరుచుకుపడ్డారు. రాష్ర్టంలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది అనడానికి అరెస్టు నిదర్శనం అని తెలిపారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు రఘును కిడ్నాపర్ల మాదిరిగా ఎత్తుకెళ్లడం ఏంటని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. దీనికి డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

9.46 గంటలకు అరెస్ట్.. కానీ

9.46 గంటలకు అరెస్ట్.. కానీ


రఘును ఉదయం 9.46 గంటలకు అరెస్టు చేసినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యిందని.. పోలీసులు మాత్రం మధ్యాహ్నం 12.45 గంటలకు అరెస్టు చేసినట్లు ఎలా చెబుతారని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఉదయమే అరెస్టు చేసి.. ఆ తర్వాత 12.30 గంటలకు రఘు కుటుంబ సభ్యులకు అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రఘు అరెస్టు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతుందోన్నారు.

కక్షసాధింపా..?

కక్షసాధింపా..?


ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన జర్నలిస్టులపై కేసీఆర్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో జర్నలిస్టుల గొంతు నొక్కాలనుకోవడం అవివేకం అవుతుందని ఇందిరాశోభన్ హితవు పలికారు. జర్నలిస్టు రఘుకు తమ పార్టీ నైతిక మద్దతు ఉంటుందన్నారు. ఇప్పటికైనా.. ప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని రఘును విడుదల చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇందిరాశోభన్ హెచ్చరించారు.

సంచలన కథనాలు

సంచలన కథనాలు


ఇటీవల జర్నలిస్ట్ రఘు పలు సంచలన కథనాలను ప్రసారం చేశారు. తొలివెలుగు యూట్యూబ్​ చానల్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అయ్యాయి. మరోవైపు తెలంగాణ వాదులను, టీఆర్​ఎస్​ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడం చర్చకు దారితీసింది.

కారణాలు ఇవే..?

కారణాలు ఇవే..?

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా జర్నలిస్ట్ రఘు ఉన్నారు. ఆయనను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హుజుర్‌ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి పేరుంది.

English summary
they are police are kidnapers.. indira shoban asks journalist raghu arrest issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X