హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌ర్ణుడి చావుకు వెయ్యి కార‌ణాలు..! కాంగ్రెస్ ఓట‌మికి కూడా అన్ని కారణాలే అంటున్న ఉత్త‌మ్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌గుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత దాదాపు మూడు వారాలు వెద‌వి విప్ప‌ని నేత‌లు త‌మ ఓట‌మికి కార‌ణాల‌ను విశ‌దీక‌రిస్తున్నారు.టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను, ఎన్నిక‌లు జ‌రిగిన విధానాన్ని విశ్లేషించారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోర్టుకు వెళ్తుంటే, జూబ్లిహిల్స్ రిటర్నింగ్ అధికారి స్లిప్పులను తీసేస్తే ఎటు పోతుంది ఈ వ్యవస్థ అని ఆయ‌న‌ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయో అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తున్నామన్నారు. ధర్మపూరి లో గెలిచిన, ఓడిన అభ్యర్థి మధ్య 1 శాతం ఓట్ల తేడా ఉందని, కోదాడ, ఇబ్రహీంపట్నంలో వీవీ ప్యాట్స్ ఎందుకు లెక్కించలేదన్నారు. వీవీ ప్యాట్స్ స్లిప్పులను లెక్కపెట్టడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Thousands of reasons for the death of Karna ..! All the reasons for Congress defeat ..!!

అంతే కాకుండా పోల్ అయిన ఓట్ల కు... లెక్కింపు ఓట్ల కి తేడా ఉంది. దీనికి ఎవరు బాద్యులు? కనీసం సమాధానం చెప్పే వాళ్లే లేరని అన్నారు. మంచిర్యాల లో 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయి. ఇదేలా ఎలా సాధ్యం అవుతుందన్నారు.

ఇలాంటి ఫిర్యాదులపై కనీసం ఎన్నికల సంఘము స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి గల కారణాలు, ఈవీఎం అవకతవకలపై ఏఐసీసీ కి ప్రాథమిక నివేదిక ఇచ్చామన్నారు. గులాబీ పార్టీకి ధీటుగా తాము కూడా ప్రచారం చేశామని, పత్రికలలో ప్రకటనలు, టీవీ లో విస్తృత ప్రచారం చేశామన్నారు. పొత్తులు ఇంకాస్త ముందుగా ఖరారు అయి ఉండి ఉంటే ఆశించిన ఫ‌లితాలు వ‌చ్చి ఉండేవ‌ని అన్నారు.

కూటమి కొనసాగింపు పై రెండు మూడు రోజుల్లో కుంతియాతో చర్చిస్తామని ఉత్తమ్ తెలిపారు. అంతే కాకుండా ఓట్ల గ‌ల్లంతు వ‌ల్ల టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల సంఘాన్ని సంప్ర‌దించ‌డం మ‌రీ హాస్యాస్ప‌ద‌మని ఉత్త‌మ్ తెలిపారు.

English summary
The Congress party seems to be getting out of the worst defeat in the early elections. Several weeks after the election results, the undivided leaders elaborate on the reasons for their defeat. TPCC Chief Uttam Kumar Reddy analyzed the reasons for the Congress party's defeat and the election management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X