హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘సైరా’ అపశృతి: బ్యానర్ కడుతున్న ఫ్యాన్స్‌కి విద్యుత్ షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడింది. కాగా, సైరా చిత్రానికి సంబంధించిన బ్యానర్లు కడుతుండగా ముగ్గురు మెగా అభిమానులు గాయపడ్డారు.

సైరా ఈవెంట్‌లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్: బౌన్సర్లపై అరిచిన జనసేనానిసైరా ఈవెంట్‌లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్: బౌన్సర్లపై అరిచిన జనసేనాని

చింతల్ వాజ్‌పెయ్ నగర్‌లో సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్‌ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్( 23), రమేష్(27), చిరంజీవి( 30) అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

మంగళవారం సాయంత్రం వాజ్ పాయ్ నగర్‌లోని ఓ భవనానికి ఉన్న సాహో బ్యానర్ తీసి బుధవారం విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ ఘాతంతో ముగ్గురు యువకులు కిందపడిపోయారు.

 Three fans injured due to electric shock after Sye Raa banner collapsed

వెంటేనే వారిని బాలానగర్ బీబీఆర్ ఆసుపత్రి కి తరలించారు వారి స్నేహితులు. ఘటనపై కేసు నమోదు వేసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సమసిన వివాదం..

సైరా రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ విచారించిన తెలంగాణ కోర్టు స్పందిస్తూ.. తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సినిమాను వినోదపరంగా చూడాలి. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు చూపించడం సాధ్యం కాదు అని న్యాయమూర్తి వాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతంలో చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రాల్లో కూడా ఇదే స్పష్టమైంది అని పేర్కొన్నారు.

 Three fans injured due to electric shock after Sye Raa banner collapsed

సైరా బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడు చరిత్ర అని తప్పుదోవ పట్టిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను టీఎస్ కోర్టు తోసిపుచ్చినట్టు సమాచారం. గతంలో గాంధీ, మొగల్ సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ఈ సందర్భంగా పిటిషన్ దారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో సైరా రిలీజ్‌ అడ్డు తొలిగినట్టు అయింది.

సినిమా కేవలం వినోద పరంగా చూడాలి. సినిమా నచ్చేది.. నచ్చనిది ప్రేక్షకులకే వదలేయాలి. ఈ దశలో సినిమాను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సైరా సినిమాపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది.

English summary
Three fans injured due to electric shock after Sye Raa banner collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X