హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెల్టు, బూట్లు.. ఒళ్లంతా బంగారమే..! శంషాబాద్‌లో 3కిలోలకు పైగా గోల్డ్ సీజ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలోలకొద్దీ బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు అడ్డదారిలో గోల్డ్ తీసుకొస్తున్నారు. అదే క్రమంలో ఆదివారం నాడు సింగపూర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింగపూర్ నుంచి విమానం ల్యాండ్ కాగానే తనిఖీలకు సిద్ధమయ్యారు. అయితే చౌటుపల్లి సురేశ్ అనే వ్యక్తి వారిని చూసి కంగారుపడ్డాడు. దాంతో నడకలో వేగం పెంచి అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేశాడు. ఆయన తీరు చూసి వారికి అనుమానం రావడంతో చుట్టుముట్టారు.

రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలి.. పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా.. వీహెచ్ సంచలన కామెంట్స్రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలి.. పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా.. వీహెచ్ సంచలన కామెంట్స్

సురేశ్ సింగపూర్ నుంచి వస్తూ 3 కిలోల 300 గ్రాముల బంగారం అడ్డదారిలో తీసుకొచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొంగ బంగారం గుట్టురట్టైంది. ఓ క్లాత్ లో బంగారు బిస్కెట్లను పేర్చి దాన్ని బెల్టులా తయారుచేసి నడుముకు కట్టుకున్నాడు. అంతేకాదు బూట్లల్లో కూడా బంగారు బిస్కెట్లు బయటపడటం గమనార్హం. సురేశ్ నుంచి స్వాధీనం చేసుకున్న వీటి ఖరీదు దాదాపు కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

three kg above gold seized from singapore person at shamshabad airport
English summary
About 3,300 grams of gold seized by customs officials at Rajiv Gandhi International Airport, Shamshabad. Accused person suresh came from singapore on sunday midnight, he caught with gold biscuits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X