హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మూడ్రోజులపాటు: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తాజాగా, మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు

Three more days rains in telangana state: hyderabad weather centre.

ఇది ఇలావుంటే, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. తూర్పు బీహార్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు, ఇది రేపు బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.

English summary
Three more days rains in telangana state: hyderabad weather centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X