హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka murder case: గవర్నర్..కిషర్ రెడ్డి సీరియస్! ముగ్గురు పోలీసులపై వేటు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారిన శంషాబాద్ వెటర్నరీ వైద్యురాలి అత్యాచారం..హత్య కేసులో ముగ్గురి పోలీసులపైన వేటు పడింది. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదు .. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేదనే ఆవేదన..జాతీయ మహిళా సంఘంతో పాటు ప్రజా సంఘాల ఆందోళన ఫలితంగా వీరి పైన చర్యలు తీసుకున్నారు. ఎస్సైతో సహా ఇద్దరు హెడ్ కాని స్టేబుళ్లను సస్సెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్తర్వులిచ్చారు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించకపోగా.. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. అయితే, బాధితురాలి ఆవేదన మేరకు గవర్నర్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతోనే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం.

ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులపై వేటు

ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులపై వేటు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషా‌బాద్ వైద్యురాలిపై అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు పోలీసుల పైన వేటు పడింది. ఎస్సైతోపాటు ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. శంషాబాద్‌ ఎస్సై ఎం.రవికుమార్‌, ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టు పోలీ్‌సస్టేషన్‌ హెడ్‌కానిస్టేబుళ్లు పి.వేణుగోపాల్‌రెడ్డి, ఎ.సత్యనారాయణ గౌడ్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. మహిళ మిస్సింగ్‌పై వచ్చిన ఫిర్యాదు నమోదులో నిర్లక్ష్యం వహించినందుకు వీరిని సస్పెండ్‌ చేసారు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించకపోగా.. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపైన జాతీయ మహిళా సంఘ ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల కాలయాపన కారణంగానే ఈ ఘోరం జరిగిందనే విమర్శలతో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పందించలేదు..అనుచిత వ్యాఖ్యలు

స్పందించలేదు..అనుచిత వ్యాఖ్యలు

తమ కుమార్తె ఆపదలో ఉందని..మిస్సయిందంటూ బాధితురాలి తల్లి తండ్రులు అర్ద్రరాత్రి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో వారు సరైన రీతిలో బాధితురాలి తల్లి తండ్రులతో వ్యవహరించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. అదే సమయంలో బాధితురాలికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా..వంటి ప్రశ్నలు వేయటం కూడా వారి పైన విమర్శలకు కారణమైంది. దీని మీద వారు ఆవేదన చెందారు. వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘాతకం జరిగి ఉండేది కాదని బాధితురాలి తల్లితండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు మరింత బాధపెట్టేలా వ్యవహరించారని మీడియా ముందు వారు రోదించారు. తమను పరామర్శించేందుకు వచ్చిన వారి ముందూ ఇదే విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసులపై ఫిర్యాదులు..విమర్శలతో వారి పైన సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు.

గవర్నర్.. కేంద్రమంత్రి సూచనలతోనే..

గవర్నర్.. కేంద్రమంత్రి సూచనలతోనే..

ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేవ పెట్టిన సమయంలో పోలీసుల వైఫల్యం ఏరకంగానూ లేనది సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత మరుసటి రోజునే విమర్శలు ఎదుర్కొన్ని పోలీసుల పైన వేటు వేసారు. అయితే, ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావటం.. బాధితురాలి తల్లితండ్రులు ఇదే విషయం పైన ఆవేదన వ్యక్తం చేసిన అంశం పైన పలువురు ప్రముఖులు స్పందించారు . బాధితురాలి కుటంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గవర్నర్ తమిళసై..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితురాలి తల్లి తండ్రులు ఇదే విషయాన్ని వారికి వివరించారు. దీంతో.. వారి పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో..వారిద్దరి సూచనల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసు సిబ్బంది పైన వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే, వీరి పైన వచ్చిన విమర్శల పైనా శాఖా పరమైన దర్యాప్తు జరిపించే అవకాశం కనిపిస్తోంది.

English summary
Cyberabad CP Sajjanar suspended Three police staff including Samshabad SI in veternary doctor rape and murder case. On victim parents complaint CP seem to be taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X