హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతుల హల్‌‌చల్, ఒకే కారులో ముగ్గురు, ఇద్దరిదీ చైనా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. అలా హైదరాబాద్ ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతులు వ్యవహరించారు. వారి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు.. ప్రశ్నించారు. క్వారంటైన్ తరలించాలని భావిస్తున్నారు.

ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వాస్తవానికి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆస్పత్రి, మెడికల్ షాప్ కోసం వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే టూవీలర్‌పై ఒకరు, కారులో ఇద్దరు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. అయితే అందుకు తగిన కారణం చెబితే.. అధికారులు అంగీకరిస్తే ఓకే.. కానీ ముగ్గురు యువతులు దర్జాగా కారులో వెళ్తున్నారు.

three women ride with their car in hyderabad, two are china

వారి కారును ఆపి పోలీసులు ప్రశ్నించారు. వారిలో ఇద్దరిది చైనా కాగా, మరొకరిది నాగాలాండ్ అని పోలీసులు గుర్తించారు. చైనా వుహాన్‌లో కరోనా వైరస్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. చదువుకునేందుకు ఇక్కడ ఉంటున్నామని యువతులు చెప్పారు. కానీ ఒకే కారులో.. అదీ సాయంత్రం ముగ్గురు వెళ్లడంతో అనుమానాలకు తావిస్తోంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. క్వారంటైన్‌కి తరలించాలని భావిస్తున్నారు. వారిలో ఇద్దరు చైనాకు చెందినవారు కావడంతో.. కరోనా వైరస్ పాజిటివ్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
three woman ride car in hyderabad.. police stop their car and ask where they go in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X