హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఇక టిక్‌టాక్ వీడియోలు బందేనా.. మరో యాప్‌కు కూడా చెక్ పడ్డట్లేనా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో ఇక టిక్‌టాక్ వీడియోలు బంద్ కానున్నాయా? అంతేకాదు హలో యాప్ కూడా తెరమరుగు కానుందా? ఈ రెండు యాప్‌లతో యువత లెక్కలేనన్ని వీడియోలు తీస్తూ అప్‌లోడ్ చేస్తూ మురిసిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశమైంది. టిక్‌టాక్, హలో యాప్ సంస్థలకు 24 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు కూడా జారీచేయడం గమనార్హం.

భారతదేశంలో ఈ రెండు యాప్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య దాదాపు 25 మిలియన్లకు పైమాటే. ఆ రెండు యాప్స్‌లో కూడా చెత్త వీడియోలు అప్‌లోడ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ క్రమంలో ఆ రెండు యాప్స్‌కు సంబంధించి 24 ప్రశ్నలు సంధిస్తూ సంజాయిషీ కోరింది సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ సమాధానం రాని పక్షంలో బ్యాన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

tiktok ban in telangana the government has decided to take action

స్నేహం ముసుగులో న్యూడ్ వీడియోలు.. అమెరికా వెళ్లి అప్‌లోడ్..!స్నేహం ముసుగులో న్యూడ్ వీడియోలు.. అమెరికా వెళ్లి అప్‌లోడ్..!

టిక్‌టాక్, హలో యాప్స్ పై ఆర్ఎస్ఎస్‌కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ మేరకు ఆ రెండు యాప్ సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ రెండు సంస్థలు సంయుక్తంగా మరో మూడు సంవత్సరాలలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాయి. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తామంటూ కొరడా ఝలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అదలావుంటే ఏడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం మరో అడుగు ముందుకేశాయి. టిక్‌టాక్, హలో యాప్స్‌పై నిషేధం విధించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌కు చెందిన ఈ రెండు యాప్స్‌పై తెలంగాణ సర్కార్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, పశ్చిమబెంగాల్ బ్యాన్ వేటు వేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్, హలో యాప్స్ ద్వారా కొందరు విద్వేషపూరితమైన వీడియోలు అప్‌లోడ్ చేస్తుండటంతో ఘర్షణలు జరిగినట్లు కేంద్రానికి ఆధారాలు కూడా సమర్పించాయట ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.

English summary
Tiktok Videos To Be Banned In Telangana? And is hello app going to the screen too? The decision of the central government was debated when the youth were getting tired of uploading countless videos of these two apps. Notice was also issued to Tiktok and Hello App for 24 questions. Meanwhile Seven States including Telangana has to be ban these two apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X