హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్జీవో నేతలు సీఎంకు చెంచాగిరి చేస్తున్నారు... అందుకే ఆర్టీసీ ఉద్యమంలో కనబడడం లేదు : జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడితే ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఉంటుందని ఉద్యమ సమయంలో చెప్పారని కాని ప్రస్తుతం ఓవైపు రైతుల ఆత్మహత్యలు మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యతో రాష్ట్రం అట్టుడుకుతుందని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడడం లేదని వ్యాఖ్యానించారు.

ప్రాణాలు పోతున్నాయి..పట్టించుకోండి: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు జగ్గారెడ్డి లేఖప్రాణాలు పోతున్నాయి..పట్టించుకోండి: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు జగ్గారెడ్డి లేఖ

ఇక గత చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా నలబై రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మీకులకు మద్దతు తెలుపుతూ ఉద్యమం కొనసాగుతున్నా వాటికి విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కళ్లున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఇక ఆర్టీసీ సమ్మెతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ..రోజు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

TNGO leaders following cm kcr so they not supporting rtc strike :mla Jagga Reddy

మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎన్జీవో సంఘాల నాయకులు ఎక్కడ కనబడడం లేదని. వారు సీఎం కేసీఆర్ మాటలనే ఫాలో అవుతూ వాటిని బలపరుస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్న స్వామిగౌడ్ , మమత కారెం రవీందర్ , దేవీప్రసాద్ తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు ఆర్టీసీ కార్మికులకు మద్దతగా నిలవకుండా సీఎం కేసీఆర్‌కు చెంచాగిరి చేసుకుటూ బతుకుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తీర్పుపై భగవంతుడు ఎవరి ఉంటారో నంటూ మరికాసెపెట్లో వెలువడనున్న కోర్టు తీర్పనుపై వ్యాఖ్యానించారు.

English summary
Telangana has become suicidal tendencies. farmers and rtc employees are suffering with their problems and getting suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X