హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus:68 మంది డిశ్చార్జ్, 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, మరో 2 ల్యాబ్‌ల్లో పరీక్షలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం రెండోసారి నెగిటివ్ రావడంతో 68 మంది డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదువతున్నాయని.. ఇక్కడ కరీంనగర్ మాదిరిగా ఇంటింటి సర్వే చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు.

మరో రెండు ఆస్పత్రుల్లో..

మరో రెండు ఆస్పత్రుల్లో..

ఇప్పుడున్న ఆస్పత్రులతోపాటు మరో రెండు దవాఖానాలకు వైద్య పరీక్షలు చేసేందుకు అనుమతి ఇస్తున్నామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సనత్ నగర్ ఆస్పత్రి, ఫోరెన్సిక్ ఆస్సత్రుల్లో 18వ తేదీ నుంచి కరోనా వైరస్ పరీక్షలు చేస్తారని తెలిపారు. దీంతో రోజుకు 5 వేల మందికి వైద్య పరీక్షలు చేసే సామర్థ్యం వస్తుందన్నారు.

ప్లీజ్.. తిరగొద్దు...

ప్లీజ్.. తిరగొద్దు...


ఆయా ఆస్పత్రుల్లో ఉన్న రోగులు అక్కడే ఉండాలని బయటకు తిరగొద్దు అని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వారికి వైద్య నిపుణులు కూడా తగిన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. వైరస్ సోకిన వారికి బలవర్దకమైన ఆహారం ఇస్తున్నామని చెప్పారు. మర్కజ్ వెళ్లొచ్చిన ఆరుగురితో 81 మందికి వైరస్ సోకిందని.. జాగ్రత్తగా ఉండాలని కోరారు. గాంధీ ఆస్పత్రిలో మహిళల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని వివరించారు.

10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు

10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు


వైద్య సిబ్బందితోపాటు వైరస్ సోకిన వారితో ఉండేవారికి కూడా ఎన్ 95 మాస్క్, పీపీఈ కిట్లు అందజేస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఆ మేరకు తగినచర్యలు తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రానికి చెందినవారే గాక.. ఇతర రాష్ట్రాలకు చెందినవారికి కూడా బియ్యం నగదు అందజేస్తున్నామని గుర్తుచేశారు.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP
87 లక్షల కుటుంబాలకు

87 లక్షల కుటుంబాలకు


ఇప్పటికే 87 లక్షల కుటుంబాలకు రూ.1500 జమ చేశామని వివరించారు. అయితే నగదు తీసుకొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సోషల్ డిస్టన్స్ పాటించకుంటే ఇబ్బందులు వస్తాయని.. బ్యాంక్ అధికారులు చెప్పినా టోకెన్ ప్రకారం అందరూ వచ్చి నగదు తీసుకోవాలని కోరారు. బ్యాంకుల్లో ఉన్న నగదు అందులోనే ఉంటాయని స్పష్టంచేశారు.

English summary
68 people discharge to various covid-19 hospitals telangana health minister etela rajender said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X