హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మన నగరాన్ని కాపాడుకుందాం: ముందుకొచ్చిన టాలీవుడ్ హీరోలు: భారీగా విరాళాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: గత కొద్ది రోజులుగా హైదరాబాదును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా విశ్వనగరం హైదరాబాదును వరదలు ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపానికి భాగ్యనగరం కాస్త అభాగ్యనగరంగా మారిపోయింది. వరదలు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఎప్పటి నుంచో నగరంపై పగబట్టినట్లుగా ప్రకృతి వ్యవహరించింది. కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికే హైదరాబాదు పరిస్థితిని తెలుసుకున్న పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సీఎం సహాయనిధికి విరాళాలు పంపుతున్నారు. తాజాగా తమ విశ్వనగరాన్ని తిరిగి పునర్నిర్మించుకునేందుకు పలువురు సినిమా స్టార్లు కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా కింగ్ నాగార్జున తాను ఎంతో ప్రేమించే హైదరాబాదు నగరం అతలాకుతలం అవడంపై స్పందించారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

Recommended Video

#HyderabadFloods:Tollywood Heros Donations,హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్..భారీగా విరాళాలు!!
రూ.50 లక్షలు విరాళం ఇచ్చిన కింగ్

రూ.50 లక్షలు విరాళం ఇచ్చిన కింగ్

హైదరాబాదును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మహానగరం ఎంతో మందికి నీడను ఇస్తోంది. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాదుకు వచ్చిన వారికి నగరం బతుకు తెరువు కల్పిస్తోంది. అలాంటి సుందర నగరంపై ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరించింది. భారీ వరదలతో నగరం రూపు మారిపోయింది. ఈ భారీ నష్టం నుంచి కోలుకునేందుకు పలువురు ప్రముఖులు పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున స్పందించారు. తన నగరంను కాపాడుకునేందుకు తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు తన వంతు సహాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు అక్కినేని నాగార్జున రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మన్మధుడు ట్విటర్ వేదికగా తెలిపారు. హైదరాబాదు నగరాన్ని ఇక్కడ జీవిస్తున్న ప్రజలను భారీ వర్షాలు కుదిపేశాయని చెప్పిన నాగార్జున తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. సత్వర చర్యల కింద రూ.550 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడాన్ని నాగార్జున స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తన నగరాన్ని కాపాడుకునేందుకు తనవంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

 ఇది మన నగరం: జూనియర్ ఎన్టీఆర్

ఇది మన నగరం: జూనియర్ ఎన్టీఆర్


ఇక నాగార్జున ఇచ్చిన స్ఫూర్తిని అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తనవంతుగా సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించారు. భారీ వర్షాలు సుందరమైన నగరాన్ని కకావికలం చేసిందని చెప్పాడు. తిరిగి అందమైన నగరాన్ని పునర్నిర్మించేందుకు తనవంతు సహాయం అందజేస్తున్నట్లు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్.. సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

మరోసారి ముందుకు వద్దాం

మరోసారి ముందుకు వద్దాం

ఇక 2020వ సంవత్సరం అత్యంత కష్టతరమైన ఏడాదిగా నిలిచిందని మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చెప్పాడు. ఎన్నో బాధలు కష్టాలు ఈ ఏడాదిలో చూశామని చెప్పిన విజయ్ దేవరకొండ... సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆదుకొందామంటూ పిలుపునిచ్చాడు. కరోనా సమయంలో ఎలాగైతే విరాళాల ద్వారా ఇతర సహాయకార్యక్రమాల ద్వారా ముందుకొచ్చామో ... మళ్లీ ఈ కష్ట సమయంలో ముందుకొచ్చి విరాళాలు సేకరిద్దామని పిలుపునిచ్చాడు. తన వంతుగా ఈరోజు రూ.10 లక్షలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ట్విటర్ ద్వారా విజయ్ దేవరకొండ ప్రకటించాడు.

రూ. కోటి విరాళంగా ఇచ్చిన మహేష్ బాబు

రూ. కోటి విరాళంగా ఇచ్చిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీవర్షాలతో నగరం సర్వం కోల్పోయిందన్న మహేష్ బాబు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సత్వర చర్యలను అభినందించాడు. ఈ కష్ట సమయంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్పందనను సైతం అభినందించిన మహేష్ బాబు... సీఎం సహాయనిధికి తన వంతుగా రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ కష్ట సమయంలో ముందుకొచ్చి మన నగరాన్ని కాపాడుకోవాలని చెప్పారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నవారిని ఆదుకుందామంటూ ప్రిన్స్ మహేష్ బాబు పిలుపునిచ్చాడు.

ప్రతి ఒక్కరూ సహాయం చేయాలన్న చిరంజీవి

ప్రతి ఒక్కరూ సహాయం చేయాలన్న చిరంజీవి

ఇక అకాల వర్షాలతో హైదరాబాదు నగరం తీవ్రంగా నష్టపోయిందంటే కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక వర్షం తీసుకొచ్చిన కష్టంతో అల్లాడిపోతున్న వారిని ఆదుకునేందుకు తనవంతుగా సీఎం సహాయనిధికి రూ. కోటి ప్రకటిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఎవరికి తోచినంతగా వారు ఈ సమయంలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు చిరంజీవి

ఇక ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వగా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 15 కోట్లను విరాళంగా ప్రకటించడం జరిగింది.

English summary
Tollywood hero Akkineni Nagarjuna had contributed Rs 50 lakhs to CM relief fund in the wake of floods hitting Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X