హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ .. 4 చార్జ్ షీట్లు... 62 మంది సెలబ్రిటీలకు క్లీన్ చిట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

మళ్ళీ తెర మీదకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఛార్జ్ షీట్ లో ఎవరి పేరు ఉందంటే? || Filmibeat Telugu

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది . సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ రాకెట్ . సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందిని అప్పట్లో విచారించింది సిట్. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు అన్న చందంగా సాగిన విచారణలో ప్రముఖుల పేర్లు ఈ రాకెట్ లో ఉన్నాయన్న వార్తలతో నీరుగారిపాయింది . తాజాగా చార్జ్ షీట్లు దాఖలు చేసిన సిట్ అధికారులు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

జయహో అనబోయి జోహార్ చంద్రబాబు అన్న టీడీపీ నేత .. వైరల్ అవుతున్న వీడియో <br>జయహో అనబోయి జోహార్ చంద్రబాబు అన్న టీడీపీ నేత .. వైరల్ అవుతున్న వీడియో

డ్రగ్స్ రాకెట్ లో వినిపించిన 62 మంది ప్రముఖుల పేర్లు

డ్రగ్స్ రాకెట్ లో వినిపించిన 62 మంది ప్రముఖుల పేర్లు

సుదీర్ఘ విచారణ తరువాత మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్.. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. 12 మంది అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు.

సెలెబ్రిటీల నుండి నమూనాలు సేకరించి విచారణ జరిపిన సిట్

సెలెబ్రిటీల నుండి నమూనాలు సేకరించి విచారణ జరిపిన సిట్

అప్పట్లో ఈ కేసు విచారణకు ఇక వాళ్ల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో రెండేళ్ల తర్వాత చార్జిషీట్లు దాఖలు చేసింది సిట్. ఈ కేసులో విచారణకు హాజరయిన సినీ, ఇతర ప్రముఖుల పేర్లు చార్జిషీటులో లేవు. అంతేకాదు 62మంది బాధితులే అని పేర్కొనటం పలు సందేహాలకు తావిస్తోంది.

62 మంది టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చిన సిట్

62 మంది టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చిన సిట్


62 మందిపై కేసు నమోదు చేసిన సిట్.. 12 మందిని నిందితులుగా చేర్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇవ్వటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ అధికారులు దాఖలు చేసిన చార్జీషీట్లు నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పై ఉంది. మరొకటి ముంబై నుంచి హైదరాబాద్ కు కొకైన్ సరఫరా చేసి అమ్ముతున్నాడని 2017లో అరెస్ట్ చేసిన అలెక్స్ లపై ఉంది.
డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదు బాధితులే అని తేల్చింది సిట్.

English summary
Remember the infamous Tollywood drug case, where the big and the mighty from the film industry were found to be involved. They were quizzed and their names did rounds in the newspapers. Ever wondered what happened to the case? Well, no one knows. One RTI activist has dug out the details of the case from the Excise department. Wonder of wonders, not even one Tollywood personality has been named in the four chargesheets that were filed in connection with the case. There were 62 Tollywood film personalities, who were questioned by the cops. But, not one of them is named in the chargesheet. This means all the 62 have been given a clean chit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X