హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టమాట ధర తగ్గిందిగా.. కిలో ధర 10 రూపాయలేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నగరవాసులకు శుభవార్త. కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన టమాట మొత్తానికి దిగొచ్చింది. చాలా రోజులుగా కొండెక్కి ఎంతకూ దిగని టమాట ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి దాకా సామాన్యుడికి అందనంత ఎత్తులో ధర పలికిన టమాట హైదరాబాద్ మార్కెట్లో బెట్టు వీడింది. 50 నుంచి 60 రూపాయల వరకు పలికిన టమాట ప్రస్తుతం 10 రూపాయలకే కిలో చొప్పున లభిస్తోంది. ఇక రిటైల్ వ్యాపారులు మాత్రం కిలో 15 చొప్పున అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా హైదరాబాద్ మార్కెట్లకు భారీ ఎత్తున టమాట దిగుమతులు పెరిగాయి. ఆ క్రమంలో నిన్న మొన్నటి వరకు అధిక ధరలు పలికిన టమాట కొండ దిగి వచ్చినట్లైంది. 50 -60 రూపాయల వరకు పలికిన టమాట ధర ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లలో కిలో పది రూపాయల ధర పలుకుతుండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.

tomato prices drop down from 60 rupees to 10 in hyderabad market

ప్రాజెక్టుల్లో అక్రమాలు అంటూ.. కేసీఆర్ కుటుంబం టార్గెట్.. విపక్ష నేతల ఫైట్..!

హైదరాబాద్‌లో ప్రధాన కూరగాయల మార్కెట్లుగా పేరొందిన సికింద్రాబాద్ మోండా, బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్, ఎల్‌బి నగర్ తదితర ప్రాంతాలకు టమాట భారీగా దిగుమతి అవుతోంది. అంతేగాకుండా రైతు బజార్లకు కూడా లారీల కొద్దీ టమాట వస్తోంది. 10 -15 రోజుల కిందటి వరకు రోజుకు 50 లోపు మాత్రమే లారీలు నగరానికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. దాదాపు రోజుకు వందకు మించి టమాట లారీ లోడ్లు వస్తున్నట్లు సమాచారం.

నిన్న మొన్నటి దాకా టమాట 50 నుంచి 60 రూపాయలు ధర పలకడంతో సామాన్యులు బేజారయ్యారు. చాలా రోజులు అదే ధర పలకడంతో టమాట కొనేందుకు జంకాల్సిన పరిస్థితి. అయితే ధరలు దిగొచ్చి కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు టమాట లారీ లోడ్లు వస్తుండటంతో ధరలు దిగొచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

English summary
Good news for city people. Tomato prices have been declining for several days now. Until yesterday, the average price of a tomato in the Hyderabad market was high. The tomatoes, which cost between Rs 50 and Rs 60, are available at Rs 10 per kg at present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X